Food Processing Sector: భారత్‌పై టారిఫ్‌లతో ఒకవైపు.. ఇంకోవైపు హెచ్–1బీ వీసాల చార్జీల పెంపుతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పటికే టాటా కంపెనీ బిగ్ షాక్ ఇచ్చింది. 40 వేల బిలియన డాలర్ల డీల్ రద్దు చేసుకుంది. తాజాగా రియలన్స్ సంస్థ కూడా ట్రంప్‌కు షార్ ఇవ్వబోతోంది. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) భారతదేశంలో ఆహార ఉత్పత్తి రంగంలో భారీ పెట్టుబడులతో ముందడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా రూ.40 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవీ భారత్‌ను మాన్యుఫాక్చరింగ్ రంగంలో కీలకంగా మారనున్నాయి. యువతకు ఉపాధి పెంచడంతోపాటు ఎగుమతులకూ అవకాశం ఉంటుంది.
కర్నూల్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్..
ఆర్‌సీపీఎల్ కర్నూల్‌లో ఏర్పాటు చేయనున్న ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ రాష్ట్రంలో ఆహార పరిశ్రమను బలోపేతం చేయనుంది. స్థానిక రైతులకు, చిన్న వ్యాపారులకు కొత్త మార్కెట్ అవకాశాలను అందించనుంది. ఈ యూనిట్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల సమీకరణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వంటి అనేక రంగాల్లో ఉపాధి కల్పన జరుగుతుంది. అంతేకాకుండా, రిలయన్స్ యొక్క ఈ పెట్టుబడి స్థానిక ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే అవకాశం ఉంది.
ఇతర సంస్థల పెట్టుబడులు..
రిలయన్స్‌తోపాటు, ఎల్‌ఎంజీ, హిందుస్థాన్ కోకకోలా బెవరేజెస్, కంధారి గ్రూప్‌లు కూడా ఆంధ్రప్రదేశ్‌తో సహా తొమ్మిది రాష్ట్రాల్లో రూ.27,760 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ సంయుక్త పెట్టుబడులు రాష్ట్రంలో ఆహార, పానీయరంగాల్లో మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆహార పరిశ్రమలో ఒక కీలక కేంద్రంగా మారే సామర్థ్యం కనిపిస్తోంది.
రిలయన్స్, ఇతర సంస్థల పెట్టుబడులు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వృద్ధికి బలమైన పునాది వేయనున్నాయి. కర్నూల్‌లో రిలయన్స్ యూనిట్ ఏర్పాటు వల్ల స్థానికంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. అదనంగా, ఈ ప్రాజెక్టులు రైతుల ఆదాయాన్ని పెంచడం, స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో గుర్తింపును తెచ్చిపెట్టడం వంటి ప్రయోజనాలను అందించనున్నాయి.
మొత్తంగా ట్రంప్ ఆడుతున్న టారిఫ్ నాటకంలో భారత్ నిలబడేలా మోడీ ప్లాన్ చేస్తున్నాడు. దానికి అంబానీ కూడా పెట్టుబడులతో ముందుకొస్తున్నాడు. అమెరికా ఫుడ్ మ్యానూఫ్యాక్చరింగ్ కు చెక్ పెట్టేలా ఇండియాలోనే ఆ యూనిట్లను నెలకొల్పి మన వస్తువులను మనమే అమ్ముకొని అమెరికా వస్తువులకు చెక్ పెట్టి భారత ఆర్థికాభివృద్ధిని పడకుండా చూడడం.. నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.