https://oktelugu.com/

ట్విస్ట్: నక్సల్స్ చెర నుంచి జవాను విడుదల

చత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టుల చేతికి చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మున్హాస్ ఎట్టకేలకు వారి చెర నుంచి విడుదలయ్యాడు. నక్సల్స్ చెరలో బందీగా ఉన్న కోబ్రా కమాండర్‍ రాకేశ్వర్‍సింగ్‍కు ఎలాంటి కీడు తలపెట్టకుండా దాదాపు ఐదురోజుల తర్వాత మావోయిస్టులు విడుదల చేశారు. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఈనెల 3న జరిగిన ఎన్ కౌంటర్ లో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు ప్రాణాలతో పట్టుకొని అపహరించుకుపోయారు. బుధవారం అతడు తమ వద్ద బందీగాఉన్నట్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 8, 2021 / 06:32 PM IST
    Follow us on

    చత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టుల చేతికి చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మున్హాస్ ఎట్టకేలకు వారి చెర నుంచి విడుదలయ్యాడు. నక్సల్స్ చెరలో బందీగా ఉన్న కోబ్రా కమాండర్‍ రాకేశ్వర్‍సింగ్‍కు ఎలాంటి కీడు తలపెట్టకుండా దాదాపు ఐదురోజుల తర్వాత మావోయిస్టులు విడుదల చేశారు.

    బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఈనెల 3న జరిగిన ఎన్ కౌంటర్ లో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు ప్రాణాలతో పట్టుకొని అపహరించుకుపోయారు. బుధవారం అతడు తమ వద్ద బందీగాఉన్నట్టు ఫొటోను పత్రికలకు విడుదల చేశారు.

    ఇక తమ తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాన్ కుమార్తె మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తిని స్వీకరించామని.. వదిలేస్తున్నట్టు మావోయిస్టులు ప్రకటించారు.

    తారేంకు 40 కి.మీల దూరంలో అజ్ఞాత ప్రదేశంలో ఉన్న మావోయిస్టుల వద్దకు మధ్యప్రదేశ్‍కు చెందిన పద్మశ్రీ ధరమ్ పాల్‍ షైనీ, గోండ్వానా అధ్యక్షులు తేలం బోరయ్యతో పాటు ఏడుగురు పాత్రికేయులు బృందంగా వెళ్లారు. పరిసర గ్రామాల గిరిజనులు కూడా వెళ్లి మావోయిస్టులతో సంప్రదింపులు జరిపారు. దీనితో కమాండోను రిలీజ్‍ చేశారు. ప్రస్తుతం బాసగూడ పోలీస్‍స్టేషన్‍కు చేరుకున్నారు.

    రాకేశ్వర్ సింగ్ స్వస్థలం జమ్మూ. 210వ కోబ్రా దళంలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. రాకేశ్వర్ సోదరుడు సైతం జవానే. గతంలో మెరుపుదాడిలో చనిపోయాడు. రాకేశ్వర్ విడుదలతో ఆయన భార్య, బిడ్డలు సంతోషం వ్యక్తం చేశారు.