https://oktelugu.com/

పోలీసులను ఆశ్రయించిన జబర్ధస్త్ వినోద్

జబర్ధస్త్ లో లేడి గెటప్ లో అచ్చం అమ్మాయిలాగా కనిపించి అలరించే జబర్ధస్త్ వినోద్ మరోసారి పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. గత ఏడాది ఇంటి ఓనర్ తో గొడవ జరిగి తల పగులకొట్టుకొని పోలీస్ మెట్లు ఎక్కాడు. అదే గొడవ ఏడాదిగా తీరకపోవడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా జబర్ధస్త్ వినోద్ తనకు న్యాయం చేయాలని ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ రెడ్డిని కలిశాడు. జబర్ధస్త్ లో లేడి గెటప్ లు వేస్తూ పొట్టపోసుకునే వినోద్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 8, 2021 / 05:53 PM IST
    Follow us on

    జబర్ధస్త్ లో లేడి గెటప్ లో అచ్చం అమ్మాయిలాగా కనిపించి అలరించే జబర్ధస్త్ వినోద్ మరోసారి పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. గత ఏడాది ఇంటి ఓనర్ తో గొడవ జరిగి తల పగులకొట్టుకొని పోలీస్ మెట్లు ఎక్కాడు. అదే గొడవ ఏడాదిగా తీరకపోవడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించాడు.

    తాజాగా జబర్ధస్త్ వినోద్ తనకు న్యాయం చేయాలని ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ రెడ్డిని కలిశాడు. జబర్ధస్త్ లో లేడి గెటప్ లు వేస్తూ పొట్టపోసుకునే వినోద్ ప్రస్తుతం తాను ఉంటున్న అద్దె ఇంటికి ఓనర్ అమ్ముతాననడంతో రూ.40 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ గా ఏడాది క్రితం రూ.13.40 లక్షలు కూడా ఇచ్చాడు.

    అయితే అప్పట్లోనే దీనివిషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వినోద్ పై ఇంటి యజమాని దాడి చేశారు.వీరిద్దరూ పోలీస్ స్టేషన్ కు ఎక్కారు. తాజాగా యజమాని ఆ ఇంటిని రూ.40 లక్షలకు అమ్మనని.. ఎక్కువ మొత్తం ఇస్తేనే ఇల్లు అమ్ముతానని మొండికేశాడని వినోద్ పోలీసులను ఆశ్రయించాడు. ఎక్కువ ఇవ్వకపోతే అడ్వాన్స్ సొమ్ము రూ.13.40 లక్షలు కూడా ఇవ్వనని బెదిరిస్తున్నట్టు వినోద్ పోలీసుల వద్ద వాపోయాడు.

    అప్పట్లో దాడి చేస్తే కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని.. కానీ ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని వినోద్ డీసీసీ దృష్టికి తీసుకొచ్చాడు. ఇప్పటికైనా న్యాయం చేయండని వినోద్ డీసీపీని వేడుకున్నాడు.