https://oktelugu.com/

Crime News: స్నేహితుడి భార్యతో ఆ టాక్.. చివరికిలా ట్విస్ట్

Crime News:స్నేహితుడే కదా అని ఇంటికి రానిచ్చాడు.. భార్యను పరిచయం చేశాడు. కానీ ఆ స్నేహితుడు అందంగా ఉన్న స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ఆమెతో మాటా మాటా కలిపాడు. పరిచయం పెంచుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకొని కాల్ లో  ఆ సంభాషణలు మొదలుపెట్టాడు. మొదట్లో భార్య కూడా సహకరించింది. మాట్లాడింది. అయితే భర్తకు తెలియడంతో కథ మరో మలుపు తిరిగింది. తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో తన భార్యతో ఫోన్ లో ఆ సంభాషణలు చేస్తున్నాడని తెలుసుకున్న భర్త […]

Written By: , Updated On : December 3, 2021 / 08:25 PM IST
Follow us on

Crime News:స్నేహితుడే కదా అని ఇంటికి రానిచ్చాడు.. భార్యను పరిచయం చేశాడు. కానీ ఆ స్నేహితుడు అందంగా ఉన్న స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ఆమెతో మాటా మాటా కలిపాడు. పరిచయం పెంచుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకొని కాల్ లో  ఆ సంభాషణలు మొదలుపెట్టాడు. మొదట్లో భార్య కూడా సహకరించింది. మాట్లాడింది. అయితే భర్తకు తెలియడంతో కథ మరో మలుపు తిరిగింది.

Crime News

Phone-Talk

తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో తన భార్యతో ఫోన్ లో ఆ సంభాషణలు చేస్తున్నాడని తెలుసుకున్న భర్త తన స్నేహితుడిని చంపిన ఘటన కలకలం రేపింది.

నమక్కల్ జిల్లా కుమరపాలయం ప్రాంతానికి చెందిన వెంకటేష్ తిరుపూర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండేవాడు. ఆ కంపెనీ వాళ్లు ఇచ్చిన గదిలో ఉంటూ వారాంతంలో భార్యతో గడిపేందుకు ఇంటికి వచ్చేవాడు. వారానికి ఒక్కరోజు మాత్రమే భర్త ఉండడం.. మిగిలిన రోజుల్లో ఒంటరిగా ఉండడంతో ఆ భార్య.. ఇతర బంధాల వైపు ఆకర్షితులైంది.

Also Read: పొరపాటున కూడా ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకండి.. ఏవంటే?

భర్త వెంకటేశ్ స్నేహితుడైన దినేశ్వరన్ తో ఫోన్ లో గంటల తరబడి మాట్లాడడం మొదలైంది. ఆ సంభాషణ రోమాంటిక్ వైపు మళ్లి శృంగార మాటలు కూడా నడిచాయి. ఈ విషయం ఆ నోటా ఈనోటా భర్తకు తెలిసింది. భార్యను నిలదీశాడు. గొడవ జరిగింది. దీంతో భార్య దూరం భర్త స్నేహితుడైన దినేశ్వరన్ ను దూరం పెట్టడం మొదలుపెట్టింది.

అయినా దినేశ్వరన్ విడవకుండా ఫోన్ లో మాట్లాడాడు. విసిగించాడు. దీంతో సీరియస్ అయిన భర్త వెంకటేశ్ స్నేహితుడిని ఓ కాలువ వద్దకు తీసుకెళ్లి తోసేశాడు. దినేశ్వరన్ కనిపించకపోవడంతో పోలీసులు విచారణ జరపగా వెంకటేశ్ తనే చంపానని ఒప్పుకున్నాడు. ఇలా స్నేహితుడి భార్యపై కన్నేసిన వ్యక్తి పరాయిలోకాలకు వెళ్లిపోయాడు.

Also Read: పెళ్లి చేసుకుంటానంటే అన్ని అర్పించిన ఇంటర్ బాలిక.. చివరికిలా..