వీటిన్నటి మధ్యలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. మన రెండు తెలుగు రాష్ట్రాలలోని క్లినిక్స్ లో దాదాపు 50 % పైగా ఉన్న క్లినిక్స్ పూర్తిగా నకిలీవే. ఎలాంటి లైసెన్స్ లేకుండా.. కనీసం డాక్టర్లు కూడా లేకుండా సిబ్బందితోనే వైద్యం చేయిస్తూ.. మనుషుల ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నారు. దురదృష్టం ఏమిటంటే.. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి నకిలీ హెయిర్ క్లినిక్స్ ను, నకిలీ డాక్టర్లను గుర్తించడంలో ప్రభుత్వాలతో పాటు పోలీస్ వ్యవస్థ, మీడియా చానెల్స్ కూడా విఫలమైయ్యాయి. కానీ ఓ వ్యక్తి ఈ నకిలీ క్లినిక్స్, నకిలీ డాక్టర్ల గుట్టు రట్టు చేశాడు. పేరు ‘సోహైల్ ఖాన్’. అనితరసాధ్యమైన స్థాయిలో ఇన్వెస్టిగేటీవ్ చేసి పూర్తి సాక్ష్యాధారాలతో నకిలీ బాగోతాలు ముసుగులు తీసి వీడియోల రూపంలో మన ముందు నిలబెట్టాడు. ఆయన వీడియోలను చూడాలంటే యూట్యూబ్ లో The Best Doctors TV అని కొట్టండి.
ఎంతో రిస్క్ చేసి.. ఇకెంతో కష్టపడి ఫేక్ హాస్పిటల్స్ గురించి నిజాలను వెలికి తీస్తున్న సోహైల్ ఖాన్ ను అభినందించాల్సిన భాద్యత మన పై, మన ప్రభుత్వాల పై ఉంది. ప్రజలకు మేలు చేసేందుకు, వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారిని చైతన్యవంతం చేసేందుకు ‘సోహైల్ ఖాన్’ చేస్తోన్న నిరంతరం కృషి అనిర్వచనీయము. ఆయన ఇలాగే నకిలీగాళ్ళ ముసుగులు తొలిగించాలని కోరుకుందాం.