Konaseema District: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కోనసీమ ఘటన మాయని మచ్చగా నిలిచింది. భారీ విధ్వంసం జరిగింది. కోనసీమ జిల్లా పేరు వివాదానికి కారణమైంది. జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని పైన మే 18 నుంచి జూన్ 18 లోపు అభ్యంతరాలు, అభీష్టాలు, సూచనలు తెలియచేయాలని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. నాటి ఘటనలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను దహనం చేశారు. అప్పటి నుంచి జిల్లాలో పరిణామాలను పోలీసులు డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. విధ్వంసానికి కారణమైన వారిని పెద్ద సంఖ్యలో అరెస్టు చేసారు. జిల్లాలో 144 సెక్షన్ విధించారు. 14 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పోలీసులు నమోదు చేసిన ఏడు కేసుల్లో ఇప్పటివరకు 176 మందిని అరెస్టు చేసారు. జిల్లా ఎస్పీ సైతం బదిలీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ జిల్లాలోని 22 మండలాల ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. దాదాపు ఆరు వేలకు పైగా అభిప్రాయాలు జిల్లా అధికారులకు నివేదించినట్లుగా సమాచారం. ఈ నెల 18 వరకూ ఈ ప్రక్రయ కొనసాగింది.
మంత్రివర్గ సమావేశంలో..
అయితే ప్రజల నుంచి రకరకాల అభిప్రాయాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీటన్నింటినీ క్రోడీకరించి.. ప్రజాభిప్రాయం ఎలా ఉందో స్పష్టతకు రానున్నారు. క్రోడీకరణ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేసి.. నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ నెల 22న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో ఈ అంశం పైనా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. సున్నితమైన అంశం కావటంతో ప్రభుత్వం జిల్లా అధికారుల నివేదిక ఆధారంగా..మెజార్టీ అభిప్రాయం మేరకు పేరును ప్రకటిస్తుందా..లేక, ఎటువంటి వివాదం లేకుండా ఈ సమస్య పరిష్కరించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తుందా అనేది ఈ సమావేశంలో తేలే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు సైతం అలెర్ట్ అయ్యారు. పరిస్థితులను ఎక్కడికక్కడే అంచనా వేస్తూ అందుకు తగిన రీతిలో ముందస్తు భద్రతను కఠినతరం చేస్తున్నారు. అయితే, సున్నితంగా మారిన ఈ వ్యవహారం లో ప్రభుత్వ నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.
ఎస్పీపై వేటు..
కోనసీమ జిల్లా ఆవిర్భావం నుంచి శాంతిభద్రతలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా ప్రస్ఫుటమైంది. గతనెల 24న అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంస ఘటనలు అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేయడం ఆ శాఖకే మచ్చ తెచ్చింది. దాంతో కోనసీమ జిల్లాలో అదుపుతప్పిన పోలీసు వ్యవస్థను గాడిన పెట్టేందుకు రాష్ట్ర డీజీపీ డాక్టర్ రాజేంద్రనాథ్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ఇటీవల అమలాపురంలో పర్యటించిన ఆయన పోలీసు వైఫల్యాలను అంచనా వేసి ప్రత్యక్షంగా సమీక్షించిన డీజీపీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డిపై తొలి బదిలీ వేటు వేశారు. మిగిలిన అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: Womb Of The AP Sea: ఏపీ సముద్ర గర్భంలో బయటపడ్డ అద్భుతం.. అంతా షాక్
నిఘా వైఫల్యమే..
జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ కొందరు సోషల్ మీడి యాలో పోస్టులు పెట్టడంతో ఒక సామాజిక వర్గానికి చెందిన వారి ఇళ్లపై దాడు లు చేసిన ఘటనలను పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అదేవిధంగా అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తూ మే 24వ తేదీన అమలాపురంలో చేపట్టిన ర్యాలీ అదుపుతప్పి అల్లర్లు, విధ్వంసానికి దారితీసింది. ముఖ్యంగా రాష్ట్ర రవాణాశాఖమంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ల ఇళ్లకు ఆందో ళనకారులు నిప్పుపెట్టి దహనం చేశారు. రెండు ఆర్టీసీ బస్సులు, ఓ ప్రైవేటు బస్సుకు నిప్పుపెట్టారు. నాటి ఘటనలో ఎస్పీ సుబ్బారెడ్డి సహా సుమారు 15 మందికిపైగా పోలీసులకు గాయాలయ్యాయి. ఈ పరిస్థితులను ముందస్తుగా అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచిలకు చెందిన సిబ్బందితోపాటు డివిజన్ స్థాయి నుంచి స్టేషన్ స్థాయి వరకు ఉన్న పోలీసు అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారనే విమర్శలను ప్రతిపక్ష పార్టీలు చేశాయి. మంత్రి విశ్వరూప్ సైతం నిఘా వైఫల్యంపై విమర్శలు చేశారు. దళిత వర్గాలకు చెందినవారైతే ఘటనకు బాధ్యులైన ఎస్పీ, డీఎస్పీలను సస్పెండ్ చేయాలని డిమాండ్లు చేశారు. అయితే ఈ ఘటనలో పోలీసుల వైఫల్యాన్ని అడిషినల్ డీజీ రవిశంకర్ అయ్యర్ పోలీసు అధికారుల అంతర్గత సమీక్షలో అధికారుల నుంచి వివరాలు తెలుసు కుని డీజీపీకి నివేదించారు. సీఎం ఆదేశాలతో అమలాపురం వచ్చిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లతోపాటు ఘటనా స్థలాలను పరిశీలించి వైఫల్యాలను అంచనా వేశారు. అప్పటికే డీజీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమా చారం. దీంట్లో భాగంగా కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డిని మంగళగిరి 6వ బెటా లియన్ కమాండెంట్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో సీహెచ్ సుధీర్‌కుమా ర్‌రెడ్డిని జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Also Read: Samantha Divorce Reason: కాఫీ విత్ కరణ్ షోలో సమంత బరస్ట్… విడాకుల ఎందుకో చెప్పి చైతూకు షాక్!