Govt Of AP Shocks Alcohol Drinkers: ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీ అస్తవ్యస్తంగా మారింది. వినియోగదారులు అడిగిన దాన్ని కాకుండా ప్రభుత్వం సరఫరా చేసిన దాన్నే తాగాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇష్టమొచ్చిన బ్రాండ్లను ప్రజలపై రుద్దుతోంది. దీంతో వారు చేసేది లేక దొరికింది తాగుతున్నారు. మద్యం పాలసీని సక్రమంగా అమలు చేయకుండా పనికి రాని బ్రాండ్లు వినియోగంలోకి తెస్తోంది. ఫలితంగా వారు ముబావంగానే తమ గొంతు తడుపుకునేందుకు సిద్ధపడుతున్నారు. వేసవి కాలంలో మద్యం ఎక్కువగా తాగాల్సి ఉన్నా ప్రభుత్వ నిర్వాకంతో మద్యం ప్రియులు తమ కోరికలను తీర్చుకోలేకపోతున్నారు.
ప్రాచుర్యంలో ఉన్న బ్రాండ్లు కాకుండా ఏవో లోకల్ బ్రాండ్లు తెరమీదకు తెస్తోంది. దీంతో వినియోగదారులు తాగేందుకు సిద్ధపడటం లేదుని తెలుస్తోంది. మీకు నచ్చింది కాదు మేమిచ్చింది తాగాలనే స్థాయికి ప్రభుత్వ తీరు వచ్చినట్లు సమాచారం. ఇక వినియోగదారులు చేసేది లేక గత్యంతరం లేక కొందరు తమ కోరిక తీర్చుకునేందుకు తాగేందుకు సిద్ధపడుతున్నా మరికొందరు మాత్రం తాము కోరిన బ్రాండ్లు లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు.
గతేడాది రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగగా ఈ ఏడాది వేసవిలో విక్రయాలు మందగించాయి. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలో ఉన్న ఓ ప్రముఖ ఉన్నతాధికారి తీరుతోనే మంచి బ్రాండ్లకు బదులు లోకల్ బ్రాండ్లు వినియోగంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. సదరు అధికారి కనుసన్నల్లోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. దీంతోనే ఏవో బ్రాండ్లు తీసుకొచ్చి వినియోగదారుల మీద రుద్దుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: New Job: కొత్త జాబ్.. శృంగార వీడియోలు చూడడమే పని.. జీతం ఎంతంటే?
ఏపీ మొత్తంలో మద్యం దుకాణాల్లో విచ్చలవిడిగా లోకల్ బ్రాండ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వాటిని తాగేందుకు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు మద్యం దుకాణాల్లో ఖరీదైన బ్రాండ్లు లభించడం లేదు. ఏమంటే కొరత ఉందని చెబుతున్నారు. కొరత ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? లోకల్ బ్రాండ్లు అమ్మితే లాభం వారికే కదా. ప్రభుత్వానికి రాదని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
రాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా ముందుకు సాగడం లేదు. ఫలితంగా ఆదాయం రావడం లేదు. కానీ లోకల్ బ్రాండ్లు అమ్ముతూ వారి నుంచి పర్సంటేజీలు మాత్రం తీసుకుంటున్నట్లు సమాచారం. ఏపీలో మద్యం ప్రియులకు మంచి బ్రాండ్లు దొరకకుండా చేస్తున్నారనే వాదన కూడా వస్తోంది. మొత్తానికి మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖరీదైన బ్రాండ్లు వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Indians Funds in Swiss Banks: స్విస్ బ్యాంకులో నల్లధనం.. మనోళ్ల సంపద ట్రిపుల్!