బాబుకు కలిసిరాని వాస్తు.. జగన్ కు కలిసొస్తుందా?

అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎం జగన్ మార్పులు చేర్పులు చేయిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో చంద్రబాబు సైతం సీఎంగా ఉన్న సమయంలో వాస్తు పండితుల సూచనల మేరకు కొన్ని మార్పులు చేయించారు. అయితే ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓటమిపాలవగా వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. Also Read: జగన్ ఉదారత.. ప్రజలకు మరో వరం.! జగన్ సీఎం అయ్యాక పాలనలో దూసుకెళుతోన్నారు. ఇటీవల ఏడాది పాలనను […]

Written By: NARESH, Updated On : September 9, 2020 6:48 pm
Follow us on


అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎం జగన్ మార్పులు చేర్పులు చేయిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో చంద్రబాబు సైతం సీఎంగా ఉన్న సమయంలో వాస్తు పండితుల సూచనల మేరకు కొన్ని మార్పులు చేయించారు. అయితే ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓటమిపాలవగా వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.

Also Read: జగన్ ఉదారత.. ప్రజలకు మరో వరం.!

జగన్ సీఎం అయ్యాక పాలనలో దూసుకెళుతోన్నారు. ఇటీవల ఏడాది పాలనను కూడా పూర్తి చేసుకున్నారు. జగన్ సర్కారు సైతం అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్, అసెంబ్లీలో చాలా మార్పులు చేర్పులు చేయించింది. ముఖ్యంగా సీఎం జగన్ తన కార్యాలయంలో వాస్తుప్రకారంగా కొన్ని మార్పులు చేయించినట్లు సమాచారం.

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూర్చునే సీటు వెనుక పద్మంలాంటి ఆకారం ఏర్పాటు చేయించుకున్నారు. అయితే జగన్ మాత్రం తన సీటు వెనక రోజూ కనిపించే బంగారపు రంగు చక్రం తొలగించి ఆంధ్రప్రదేశ్ చిహ్నం కన్పించేలా మార్పు చేయించారు. ఇది కూడా అప్పట్లో చర్చనీయాశం అయింది. తాజాగా మరోసారి అసెంబ్లీలో మార్పులు చేయిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది.

Also Read: ‘చలో అంతర్వేది’ భగ్నం.. బీజేపీ, జనసేన నేతల నిర్బంధం

అధికారుల భద్రతా కారణాల పేరుతో సచివాలయం, అసెంబ్లీల్లోని మరో రెండు గేట్లను అధికారులు మూసి వేశారు. సెక్రటేరియట్ గేట్ 1, అసెంబ్లీ గేట్ 2లకు అటు, ఇటు అధికారులు తాజాగా గోడ కట్టిస్తున్నారు. కాగా ఇటీవలే అసెంబ్లీ గేట్-5, సెక్రటేరియట్ ఉత్తర, దక్షిణ గేట్‌లకు అడ్డంగా గోడలు నిర్మించారు. గతంలోనే చంద్రబాబు నాయుడు రాకపోకలు సాగించే మార్గాన్ని మార్చేసిన అధికారులు మరోసారి అసెంబ్లీలో కొత్త నిర్మాణాలు చేపట్టడం ఆసక్తిని రేపుతోంది. దీంతో గతంలో బాబుకు కలిసిరాని వాస్తు జగన్ కైనా కలిసి వస్తుందా? లేదో వేచి చూడాల్సిందే..!