అక్బరుద్దీన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయద్ధం జరుగుతోంది. నేడు కరోనాపై చర్చ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ తోపాటు టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం కూడా ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. మంత్రి ఈటల ప్రసంగం తెలంగాణ హెల్త్ బులిటెన్ ను తలపించిందని ఎద్దేవా చేశారు. కరోనాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రభుత్వతీరును ఈ రెండు పార్టీలు ఎండగట్టాయి. Also Read: కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై […]

Written By: NARESH, Updated On : September 9, 2020 6:13 pm
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయద్ధం జరుగుతోంది. నేడు కరోనాపై చర్చ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ తోపాటు టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం కూడా ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. మంత్రి ఈటల ప్రసంగం తెలంగాణ హెల్త్ బులిటెన్ ను తలపించిందని ఎద్దేవా చేశారు. కరోనాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రభుత్వతీరును ఈ రెండు పార్టీలు ఎండగట్టాయి.

Also Read: కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై టాస్క్ ఫోర్స్: కేసీఆర్ సంచలనం

ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగాలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధచూపకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రులను అభివృద్ధిలో చేయడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని.. దీంతోనే అనేక మంది కరోనా బారిన మృతిచెందారన్నారు. సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీరును కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీలు తప్పుబట్టారు.

అనంతరం సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. కరోనా కరోనా నియంత్రణకు మంత్రి ఈటల అహర్నిషలు కృషి చేశారని సీఎం వెనుకేసుకొచ్చారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ విమర్శలపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అనవసరంగా నోరు పారేసుకోవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కంటే ముందు మెల్కొని చర్యలు చేపట్టిందన్నారు. అయినప్పటికీ ఇంకా కరోనా తగ్గలేదన్నారు. కరోనా కట్టడికి స్పష్టమైన ప్రణాళిక ఉండాలన్నారు. కరోనా యోధులకు వేతనాలు పెంచి ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

కరోనా మహమ్మరి వల్లే దేశం హెల్త్ రంగంలో ఎంత వెనుకబడిందో తెలిసొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేస్తోందన్నారు. అయితే గతంలో ఉన్న కాంగ్రెస్ పాలకుల దరిద్రమే తమకు వారసత్వంగా లభించిందన్నారు. ఉస్మానియా ఆస్పత్రితోపాటు ప్రభుత్వ ఆస్పత్రులను గత 50, 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. అదే తమకు వారసత్వం వచ్చిందని.. మేము ఏమి వాటిని తయారు చేయలేదంటూ భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఒవైసీలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు.

Also Read: కాంగ్రెస్ దయ వల్లే కేసీఆర్ కు ఇంత క్రెడిటా?

ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్ లైన్లో పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ధరణి పోస్టర్లో పంచాయతీ, పురపాలిక, నగరపాలిక, జీహెచ్ఎంసీ ఆస్తుల వివరాలు ఉంటాయని సీఎం తెలిపారు.