చైనా ఎఫెక్ట్.. బాలీవుడ్ స్టార్లపై మండిపడుతున్న నెటిజన్లు..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. సుశాంత్ ఆత్మహత్యను ఆయన అభిమానులు, నెటిజన్లు ఇప్పట్లో మర్చిపోయేలా కన్పించడం లేదు. ఈ విషాదం కొనసాగుతుండగానే భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందారు. ఈ సంఘటనను సుశాంత్ అభిమానులు, మద్దతుదారులు బాలీవుడ్ స్టార్లకు లింకు పెడుతూ సోషల్ మీడియాలో ఫైరవుతోన్నారు. హైకోర్టు మాట కేసీఆర్ ఎందుకు వినడం లేదు? భారత జవాన్ల మృతి […]

Written By: Neelambaram, Updated On : June 19, 2020 9:33 pm
Follow us on


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. సుశాంత్ ఆత్మహత్యను ఆయన అభిమానులు, నెటిజన్లు ఇప్పట్లో మర్చిపోయేలా కన్పించడం లేదు. ఈ విషాదం కొనసాగుతుండగానే భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందారు. ఈ సంఘటనను సుశాంత్ అభిమానులు, మద్దతుదారులు బాలీవుడ్ స్టార్లకు లింకు పెడుతూ సోషల్ మీడియాలో ఫైరవుతోన్నారు.

హైకోర్టు మాట కేసీఆర్ ఎందుకు వినడం లేదు?

భారత జవాన్ల మృతి నేపథ్యంలో యావత్ దేశం చైనా వస్తువులను బైకాట్ చేయాలని నినదిస్తోంది. ఈనేపథ్యంలోనే ఇండియాలో చైనా కంపెనీ వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్లు వ్యవహరిస్తున్న పలువురు బాలీవుడ్ స్టార్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. తక్షణమే చైనా వస్తువులకు చేస్తున్న ప్రమోషన్లను బాలీవుడ్ స్టార్లు ఆపేయాలని లేకుంటే వారిని సైతం బైకాట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

సీఎం తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..!

కాగా బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్ వీవో, రణ్‌బీర్ కపూర్ ఒప్పో, రణ్‌వీర్ సింగ్‌ షావోమి, సల్మాన్ ఖాన్ రియల్‌మీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ వివో ఐక్యూ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. వీరితోపాటు బిగ్ బీ అమితాబ్ సహా పలువురు సెలబెట్రీలు చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఇతర వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు. చైనా కంపెనీలకు ప్రచారం చేస్తున్న స్టార్లు ఇకపై ప్రచారం చేయద్దని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కోరుతోంది. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్లపై ఫైరవుతున్ననెటిజన్లు చైనా ఇష్యూ నేపథ్యంలో మరోసారి వారిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.