https://oktelugu.com/

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘పేరు’ వివాదంలో నోటీసులు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి కొత్త సమస్యలను తెచ్చి పెట్టారు. దీంతో జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీకి కోర్టు నోటీసులు అందాయి. తమ పార్టీ పేరు వాడుకొంటున్నారని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. ఈ తేనెతుట్టును కదిపింది మాత్రం వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 13, 2020 9:07 pm
    Follow us on


    వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి కొత్త సమస్యలను తెచ్చి పెట్టారు. దీంతో జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీకి కోర్టు నోటీసులు అందాయి. తమ పార్టీ పేరు వాడుకొంటున్నారని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. ఈ తేనెతుట్టును కదిపింది మాత్రం వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్టీ వ్యతిరేక కర్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, సిఎం, ఎమ్మెల్యేల విషయంలో చేసిన వ్యాఖ్యలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో ఆ షోకాజ్ నోటీసును ఎన్నికల సంఘానికి తీసుకువెళ్లి యుజవన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీసు జారీ చేసిందని ఫిర్యాదు చేశారు. ఆ విషయం మీడియాలో రావడంతో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు బాషా స్పందించారు. తమ పార్టీ పేరును వాడుకోవడాన్ని పత్రికాముఖంగా ఖండించారు.

    తాజాగా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరైనా ’వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాడుకొంటుందని పిటీషన్ ను కోర్టులో బాషా దాఖలు చేశారు. దీంతో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు వినియోగించడంపై అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయగా ఎన్నికల కమిషన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. అయినప్పటీకీ ఆ పేరును జగన్ నేతృత్వంలోని పార్టీ విరివిగా వినియోగించుకుంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే జగన్ పార్టీగా ప్రజల్లో గుర్తింపు వచ్చింది.

    జగన్ పట్టుదల.. టెక్ దిగ్గజం ఏపీకి..

    అయితే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంతగా స్థాపించలేదు. 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు కోసం రిజిస్ట్రేషన్ కు జగన్ ప్రయత్నించగా అప్పటికే ఆ పేరుతో శివకుమార్ అనే వ్యక్తి పార్టీ ఏర్పాటు చేసి ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో జగన్ ఆ పార్టీని శివకుమార్ వద్ద నుంచి తీసుకుని 2011 మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని అధికారికంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. పార్టీలో శివకుమార్ చిన్న పదవిని ఇచ్చారు. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడైన బాషా ఏర్పాటు చేశారు.

    కోర్టు నోటీసుల విషయంలో తమ పార్టీకి వచ్చిన ముప్పేమీ లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇది కేవలం ప్రచారం కోసం ఇటువంటి పిటీషన్ లను కొందరు దాఖలు చేస్తుంటారని దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, పార్టీ న్యాయపరంగానే దీనిని ఎదుర్కొంటుందని వారు చెబుతున్నారు.