
Telangana CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. హుజురాబాద్ లో అధికార పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ లో పగ ఇంకా వేడెక్కినట్లు తెలుస్తోంది. కేంద్రంపై పోరాటం చేసేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం రాష్ర్ట వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేసి తన పట్టు నిరూపించుకుంది. దీంతో కేంద్రం మెడలు వంచుతామని నేతలు చెబుతుండటం విశేషం.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈనెల 14న తిరుపతిలో నిర్వహించే సదరన్ జోనల్ కౌన్సిల్ (ఎస్ జెడ్ సీ) భేటీ జరగనుంది. దీనికి ఏపీ తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అండమాన్, లక్ష్యదీప్,పుదుచ్చేరి స్టేట్ల లెఫ్ట్ నెంట్ గవర్నర్లు హాజరు కానున్నారు. కానీ ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ మాత్రం రావడం లేదని తెలుస్తోంది. మొదట రావాలని నిర్ణయించుకున్నా రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కేంద్ర, రాష్ర్టం మధ్య సమన్వయం కొరవడిందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టడం వెనుక బలమైన కారణం ఉందనే వాదన వినిప్తోంది. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపుతో టీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికలో అధికార పార్టీని బోల్తా కొట్టించడంతో నేతల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది.
రెండేళ్ల క్రితమే నిర్వహించాల్సిన సమావేశం కరోనా కారణంగా ఏడాది వాయిదా పడగా అమిత్ షా అనారోగ్యం కారణంగా గతేడాది కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్వహించేందుకు నిర్ణయించినా కేసీఆర్ మాత్రం రాకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హోం మంత్రి మహమూద్ అలీని పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలను అమిత్ షాకు వెల్లడించేందుకు అలీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read: అమిత్‌షాతో సీఎం భేటీ కాకపోవడానికి కారణాలేంటి ?