
Balakrishna: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్” అంటూ ఒక సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా సెట్స్ పై ఉంది కూడా. చిరంజీవి హీరోగా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. మరి బాలయ్య బాబు హీరోగా “గాడ్ ఫాదర్” ఏమిటి ? ఈ ముచ్చట తీసుకొచ్చింది బాలయ్య కాదు, హీరో నాని. క్లాసిక్ మూవీగా “గాడ్ ఫాదర్” సినిమా చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోయింది.
ఎప్పుడో 1972లో వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలవడం విశేషం. మరి ఇలాంటి మూవీస్ బాలయ్యకు బాగా సెట్ అవుతాయి. అందుకే “గాడ్ ఫాదర్” సినిమాను బాలయ్య చేస్తే చూడాలని ఉందని ప్రకటించాడు నాని. మరీ నాని కోరికను బాలయ్య తీరుస్తాడా ? నిజానికి బాలయ్యకి గాడ్ ఫాదర్ లాంటి కథలు బాగా సూట్ అవుతాయి.
పైగా బాలయ్య(Balakrishna) లుక్ కూడా గాడ్ ఫాదర్ రేంజ్ లోనే ఉంటుంది కాబట్టి.. నాని అందుకే ఆ కోరికను కోరి ఉండొచ్చు. మొత్తానికి బాలయ్య ఎలాంటి సినిమా చేయాలి కూడా నానినే చెప్పేస్తే.. ఇక బాలయ్య ఎందుకు ? అని యాంటీ ఫ్యాన్స్ ఎప్పటిలాగే కామెంట్స్ చేస్తున్నారు అనుకోండి. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం.. ఆహా ఓటీటీ సంస్థ పెట్టిన తర్వాత అద్భుతంగా సక్సెస్ అయింది.
అయితే, ఇప్పటి వరకు ఎంతవరకు సక్సెస్ అయిందో.. అంతకంటే ఎక్కువుగా బాలయ్య షో చేసిన తర్వాత ఆహా సక్సెస్ అవ్వడం విశేషం. నిజానికి యాడ్ మేకర్స్ ముందు నుంచీ బాలయ్యను కరెక్ట్ గా వాడుకోలేదు. కానీ ఇప్పుడు బ్రాండ్ అంటే బాలయ్య హ్యాండ్ పడాల్సిందే అనే సెన్స్ ఇప్పుడు కలుగుతుంది అందరికీ.
అందుకే, ప్రస్తుతం బాలయ్య పై యాడ్స్ చేయడానికి మేకర్స్ తెగ ఉత్సాహ పడుతున్నారు. అటు బాలయ్య కూడా తనకు కరెక్ట్ అనిపిస్తే యాడ్ చేయడానికి రెడీ అంటున్నాడు. త్వరలోనే బాలయ్యను కొన్ని స్పెషల్ యాడ్స్ లో చూడబోతున్నాం అన్నమాట.
Also Read: హీరో నాని తాగే మద్యం బ్రాండ్ ఇదే.. బాలయ్య ముందు ఒప్పుకున్నాడు