బీటెక్ రవి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా?

కడప ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి రాజీనామా ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో మూడురాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు బీటెక్ రవి ప్రకటించారు. ఈమేరకు ఆయన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు, శానస మండలి ఛైర్మన్ కు పంపించారు. అయితే మూడు రాజధానుల అంశానికి బీటెక్ రవికి ఏమాత్రం సంబంధం లేదని.. అలాంటప్పుడు ఆయన రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. […]

Written By: Neelambaram, Updated On : August 4, 2020 4:19 pm
Follow us on


కడప ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి రాజీనామా ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో మూడురాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు బీటెక్ రవి ప్రకటించారు. ఈమేరకు ఆయన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు, శానస మండలి ఛైర్మన్ కు పంపించారు. అయితే మూడు రాజధానుల అంశానికి బీటెక్ రవికి ఏమాత్రం సంబంధం లేదని.. అలాంటప్పుడు ఆయన రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.

Also Read: ఎలా దెబ్బకొట్టాలో.. కేసీఆర్ ఆదర్శం అంతే!

కడప జిల్లాకు మూడు రాజధానులకు సంబంధం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో బీటెక్ రవి తన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం వెనుక పెద్ద తతాంగమే నడిచినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ సొంత జిల్లా కడప అయినందుకే అక్కడి నుంచే అమరావతి సెగ తాకాలనే ఉద్దేశ్యంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో రాజీనామా చేయించారనే టాక్ విన్పిస్తోంది. సీఎం సొంత జిల్లా నుంచి అమరావతి రాజధాని కోసం బీటెక్ రవి రాజీనామా చేస్తే అది జాతీయ స్థాయిలో చర్చగా మారుతుందని బాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పక్కా వ్యూహాంలో భాగంగా బీటెక్ రవి రాజీనామా అస్త్రాన్ని బాబు తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది.

బీటెక్ రవి 2017లో కడప స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో వైఎస్ వివేకానందపై 38ఓట్ల స్వల్ప మోజార్టీతో విజయం సాధించారు. ఆయన పదవీకాలం మరో మూడేళ్లు ఉండనుంది. సీఎం జగన్ శానస మండలి రద్దుకే మొగ్గుచూపుతుండటంతో ఎమ్మెల్సీల పదవీ కాలం ఎన్ని రోజులు ఉంటుందో తెలియడం లేదు. ఆయన రాజీనామా చేసినా తిరిగి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెల్సినా రాజీనామా చేయడం వెనుక బాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. శానన మండలి ఛైర్మన్ టీడీపీకి చెందిన వ్యక్తే ఉండటంతో ఆయన రాజీనామా వెంటనే ఆమోదించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

Also Read:జగన్ భాద్యత వహిస్తాడా ?

బీటెక్ రవి రాజీనామాను చంద్రబాబు ఒక ఆయుధంగా ప్రభుత్వంపై ఉపయోగించినట్లు తెలుస్తోంది. అంతేతప్ప బీటెక్ రవి రాజీనామాతో ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితులు లేవు. అమరావతి రాజధానికి టీడీపీ కట్టుబడి రాజీనామాలు కూడా చేసిందనే బాబు ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ ఆ ప్రాంతంలో దోషిగా నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలతో రాజీనామాలు చేయించి ఆ ప్రాంతంలో మరింత సానుభూతి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే బాబు ఎత్తుగడ ఏమేరకు ఫలిస్తుందనేది వేచి చూడాల్సిందే..!