https://oktelugu.com/

చెర్రీ, పూరీ రెండోసారి..

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా పరిచయమైన రామ్‌ చరణ్‌ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తక్కువ టైమ్‌లోనే మంచి సినిమాలు చేశాడు. క్లాస్, మాస్‌ ప్రేక్షకులకు చేరవై మెగా పవర్ స్టార్ అనే బిరుదుకు న్యాయం చేస్తున్నాడు. ‘రంగస్థలం’తో నటనలో మరో మెట్టుఎక్కడమే కాకుండా బ్లాక్‌ బస్టర్ విజయాన్ని అందుకున్న చెర్రీ.. తండ్రి కోసం నిర్మాతగా కూడా మారాడు. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 తీసి ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చాడు. ఆపై, మెగాస్టార్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 4, 2020 3:21 pm
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా పరిచయమైన రామ్‌ చరణ్‌ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తక్కువ టైమ్‌లోనే మంచి సినిమాలు చేశాడు. క్లాస్, మాస్‌ ప్రేక్షకులకు చేరవై మెగా పవర్ స్టార్ అనే బిరుదుకు న్యాయం చేస్తున్నాడు. ‘రంగస్థలం’తో నటనలో మరో మెట్టుఎక్కడమే కాకుండా బ్లాక్‌ బస్టర్ విజయాన్ని అందుకున్న చెర్రీ.. తండ్రి కోసం నిర్మాతగా కూడా మారాడు. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 తీసి ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చాడు. ఆపై, మెగాస్టార్ కలల మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. సైరా అనుకున్న కలెక్షన్స్‌ రాబట్టలేకపోయినా తండ్రి కల నెరవేర్చిన సంతృప్తి చరణ్‌కు కలిగింది.

    Also Read: మోహన్‌బాబు ఇంటికెళ్ళి బెదిరించింది వారే !

    ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చేస్తున్నాడు రామ్ చరణ్. జూనియర్ఎన్టీఆర్ మరో కథానాయకుడు. ఈ పాన్‌ ఇండియా మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పలు భాషల్లో విడుదలయ్యే చిత్రం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ జీవితం ఆధారంగా వచ్చే ఫిక్షనల్‌ మూవీలో సీతారామరాజుగా చెర్రీ, భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చెర్రీ రామరాజు టీజర్కు విపరీతమైన స్పందన వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు వరకూ రామోజీఫిల్మ్‌ సిటీలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంది. కరోనా దెబ్బకు షూటింగ్‌ ఆగిపోవడంతో ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా కొమురం భీమ్‌ టీజర్ను రిలీజ్‌ చేయడం కూడా సాధ్యపడలేదు. దర్శకుడు రాజమౌళికి కరోనా సోకడంతో ఈ చిత్రం షూటింగ్‌ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందనేదానిపై క్లారిటీ లేదు.

    Also Read: ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ స్టోరీ సీక్రెట్స్ !

    ఈ టైమ్‌లో మిగతా యూనిట్‌ సభ్యులు ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్… త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నాడు. రాజమౌళి సైతం తన నెక్ట్స్‌ ప్రాజెక్టు మహేశ్‌ బాబుతో అనుకుంటున్నాడు. కానీ, రామ్‌ చరణ్‌ తదుపరి చిత్రం ఏదనేదానిపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. . తన తదుపరి చిత్రాన్ని చరణ్ ఫలానా దర్శకుడితో చేస్తాడంటూ పలురకాల వార్తలు వచ్చినప్పటికీ, ఇంకా ఏదీ ఖరారు కాలేదు. అయితే, లాక్‌డౌన్‌ బ్రేక్‌లో చెర్రీ కొన్ని స్టోరీలు విన్నాడట. ఈ క్రమంలో పూరి జగన్నాథ్‌ చెప్పిన ఓ ఇంట్రస్టింగ్‌ స్టోరీ చెర్రీకి బాగా నచ్చిందట. దాంతో, తన తర్వాతి చిత్రాన్ని జగన్‌తోనే చేయాలని చరణ్‌ భావిస్తున్నట్టు సమాచారం. కొన్ని రోజుల కిందట పూరీ… మెగాస్టార్ ఇంటికి వచ్చాడు. దాంతో, అతను చిరంజీవికి స్టోరీ చెప్పేందుకే వచ్చాడని.. ఎప్పటి నుంచో మెగాస్టార్ తో సినిమా తీయాలని భావిస్తున్న పూరి ఈ సారి చిరు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కొట్టేశాడన్న వార్తలు వచ్చాయి. కానీ, అతను రెడీ చేసిన స్టోరీ చరణ్‌ కోసమే అని తెలుస్తోంది. చెర్రీ చేసే మూవీస్‌ కథలు చిరంజీవి కూడా వింటాడు. ఈ నేపథ్యంలో పూరి చెప్పిన స్టోరీ మెగాస్టార్ కు నచ్చిందట. దాంతో, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చరణ్ ఓ చిత్రాన్ని చేయనున్నాడంటూ తాజాగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దీనిని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తారని సమచారం. చరణ్ ను హీరోగా చిత్రసీమకు పరిచయం చేసింది పూరీనే కావడం గమనార్హం. చెర్రీ ఫస్ట్‌ మూవీ ‘చిరుత’కు అతనే దర్శకత్వం వహించాడు. అంతా సవ్యంగా సాగితే ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పని చేయబోతున్నారు.