https://oktelugu.com/

కేసీఆర్‌లో దూకుడు తగ్గడానికి అదే కారణమా?

తెలంగాణలో కేసీఆర్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ దూకుడుగానే వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు పలుసార్లు వివాదాస్పదంగా మారినా ఎన్నడూ తనలోని దూకుడును తగ్గించిన సందర్భాలు లేవనే చెప్పొచ్చు. ఇక సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలపై కేసీఆర్ తనదైన శైలిలో మాటలతుటాలను పేల్చుతూ కేసీఆర్ రూటే సెపరేట్ అన్నట్లుగా వ్యవహరించేవారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కారు హవానే కొనసాగడంతో కేసీఆర్ మాటకు తిరుగులేకుండా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2020 / 06:22 PM IST
    Follow us on

    తెలంగాణలో కేసీఆర్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ దూకుడుగానే వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు పలుసార్లు వివాదాస్పదంగా మారినా ఎన్నడూ తనలోని దూకుడును తగ్గించిన సందర్భాలు లేవనే చెప్పొచ్చు. ఇక సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలపై కేసీఆర్ తనదైన శైలిలో మాటలతుటాలను పేల్చుతూ కేసీఆర్ రూటే సెపరేట్ అన్నట్లుగా వ్యవహరించేవారు.

    తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కారు హవానే కొనసాగడంతో కేసీఆర్ మాటకు తిరుగులేకుండా పోయింది. కేసీఆర్ ధాటికి తట్టుకోలేక ప్రతిపక్షాలు తోకముడిచిన సందర్భాలున్నాయి. అయితే కరోనా ఎంట్రీ తర్వాత కేసీఆర్ కు పరిస్థితులు వ్యతిరేకంగా మారుతోన్నాయి. రాష్ట్రంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లో కేసీఆర్ నిత్యం మీడియా సమావేశాలు పెట్టి ప్రజలు అప్రమత్తం చేశారు. ప్రజారోగ్యం ఎన్ని కోట్లయినా ఖర్చుడుతామని భరోసా కల్పించారు. దేశంలో అందరికీ కంటే ముందు లాక్డౌన్ విధించారు. రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్, రూ.1500లను ముందుగా ప్రకటించింది కూడా కేసీఆరే. నిత్యం సమీక్షలు, ప్రెస్ మీట్లతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు.

    Read More: కేసీఆర్ ని విమర్శించే ధైర్యం బాబుకు లేదా..?

    అయితే ఇప్పుడు కరోనా విషయంలో అలాంటి హడావుడి పెద్దగా కన్పించడం లేదు. నిజానికి ఆన్ లాక్ ముందువరకు కూడా తెలంగాణలో కరోనా కంట్రోల్లోనే ఉంది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో కేసులు నామమాత్రంగానే ఉంది. అయితే కరోనా నిబంధనల విషయంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు సంఖ్య పెరిగాయనే వాదనలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడి చేయకపోగా కరోనాతో సహజీవనం అనే కొత్త పల్లవి పాడటంతో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి.

    దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో వీరి నుంచి ఆయా జిల్లాలకు కరోనా వేగంగా వ్యాప్తిచెంది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ కరోనా విషయంలో చేతులేత్తిసిందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టకుండా సచివాలయం కూల్చివేత, హరితహారం వంటి పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

    Also Read: కాంగ్రెస్ కు షాకిచ్చిన పెద్దాయన..!

    తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా చేయడంపై హైకోర్టు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలతో కరోనా టెస్టులు పెంచినప్పటికీ అప్పటికే రాష్ట్రంలో కరోనా పరిస్థితి చేయిదాటిపోయింది. కరోనాకు కేరాఫ్ గా అడ్రస్ భాగ్యనగరం మారిన సమయంలోనే సీఎం కేసీఆర్ హైదరాబాద్లో కన్పించడం పోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రగతి భవన్లో సిబ్బందికి కరోనా రావడంతో సీఎం కేసీఆర్ కూడా కరోనా సోకిందని ప్రచారం జరిగింది. దీంతో కేసీఆర్ ఎక్కడా? అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున నెటిజన్లు నిలదీశారు. కొందరైతే ఏకంగా కేసీఆర్ కన్పించడం లేదంటూ హైకోర్టు పిటిషన్ కూడా దాఖలు చేశారు.

    రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం కేసీఆర్ చేయాల్సిన స‌మీక్ష‌లను గ‌వ‌ర్న‌ర్ తమిళ సై చేశారు. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవల సీఎం కేసీఆర్ మళ్లీ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకొని పాలన పనులపై దృష్టిసారించారు. రోజువారీ సాధార‌ణ కార్య‌క్ర‌మాలతోపాటు కరోనాపై సమీక్షలు చేస్తున్నారు. అయితే కరోనాపై ఇంతముందు చూపిన దూకుడు మాత్రం ఆయనలో ఎక్కడ కన్పించకపోవడం గమనార్హం.