స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఒక ట్వీట్ చేశాడు. కాకపోతే ఆ ట్వీట్ మరీ కామెడీగా ఉంది. ప్రియమైన అభిమానులందరికి అంటూ ఆకాష్ ఏదేదో రాసుకొచ్చాడు. అసలు ఇతనికి అభిమానులు ఎక్కడ ఉన్నారో అతనికే తెలియాలి. ఏదో తండ్రి సపోర్ట్ తో రెండు సినిమాల్లో నటిస్తే.. అభిమానులు పుట్టుకొస్తారా.. అసలు వీళ్లను హీరోలు ఆనడమే మనం చేస్తోన్న తప్పు ఏమో. ఇంతకీ ఈ బాబు, ఆయనగారి అభిమానులను ఏమి కోరాడు అంటే..బాబు పుట్టిన రోజు అట. దాంతో ఆయనగారి అభిమానులు ఎక్కడ తన పోస్టర్లకు పాలాభిషేకాలు, బ్యానర్లు కట్టి.. ఫ్యాన్స్ ఎక్కడ ఉపవాసాలు ఉంటారో అని బాబుకు తెగ దిగులు పుట్టింది.
Also Read: చిరును కలిసిన పూరి… సినిమా కోసమేనా?
సో.. తనకు పుట్టిన మిక్కిలి దిగులతో.. దయచేసి తన పుట్టినరోజును జరపకండి అంటూ ఫ్యాన్స్ కి ఆదేశాలు జారీచేశాడు. అసలు ఈ ఆకాష్ పూరి అంటేనే సగం మంది పల్లె ప్రేక్షకులకు తెలియదు. అయినా మనోడికి ఇంకా హీరో ట్యాగ్ కూడా రాలేదు. అయినప్పటికీ అభిమానులు ఉన్నట్లు మనోడు ఊహల్లో విహరిస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నాడేమో. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యాన్స్ అంటూ ఇలాంటి విజ్ఞప్తి చేసే ముందు, ఆకాష్ తన తండ్రికి ఒక మాట చెప్పాల్సింది. ఏముంది ఇప్పుడు నెటిజన్లు మనోడిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. నా ఫ్యాన్స్ అని మనోడు పొరపాటున అన్నందుకు మరీ మోసేస్తున్నారు.
Also Read: విజయ్ బిజినెస్ స్పీడ్ ఏ హీరోకి లేకపాయే !
అన్నట్లు బాబు తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పి.. అధికారులు, పోలీసులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, సామాజిక దూరం పాటించాలని.. అబ్బో ఏకంగా పోలీసులకే రూల్స్ గుర్తు చేశాడు. ఇంకా నయం డాక్టర్స్ కి వైరస్ గురించి స్పీచ్ లు ఇవ్వలేదు. ఇచ్చినా ఇస్తాడు… తానూ హీరోని అని అనుకుంటున్నాడు కదా.. హీరో ఏమైనా అనొచ్చు అని ఫీలింగ్ లో ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీలో హీరో అని పిలిపించుకోవాలంటే.. ఇక నుండి ఒక కండిషన్ పెట్టాలి. మినిమమ్ మూడు హిట్స్ ఉన్న వారినే హీరో అని పిలవాలని. లేకపోతే ప్రతి ఒక్కడు ఇక ఆకాష్ పూరి లాగా అభిమానులకు పాలాభిషేకాలు వద్దు అని ట్వీట్ చేస్తారు.
https://twitter.com/ActorAkashPuri/status/1286238208615833601