https://oktelugu.com/

నిమ్మగడ్డ తప్పుకుంది అందుకేనట?

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం తమ వల్ల కాదంటూ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌‌ ఇప్పటికే చేతులెత్తేశారు. అయితే.. ఇప్పటివరకు పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించిన ఆయన సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు. ముందు నుంచీ తన హయాంలోనే అన్ని ఎన్నికలు కంప్లీట్‌ చేస్తానంటూ చెప్పుకొస్తున్న ఆయన.. ఒక్కసారిగా కాడెత్తేయడంపై ఆసక్తికర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత వద్దన్నా.. న్యాయస్థానంలో కొట్లాడి మరీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 25, 2021 / 12:27 PM IST
    Follow us on


    ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం తమ వల్ల కాదంటూ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌‌ ఇప్పటికే చేతులెత్తేశారు. అయితే.. ఇప్పటివరకు పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించిన ఆయన సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు. ముందు నుంచీ తన హయాంలోనే అన్ని ఎన్నికలు కంప్లీట్‌ చేస్తానంటూ చెప్పుకొస్తున్న ఆయన.. ఒక్కసారిగా కాడెత్తేయడంపై ఆసక్తికర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత వద్దన్నా.. న్యాయస్థానంలో కొట్లాడి మరీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌‌ ఎన్నికలను నిర్వహించారు. తొలి షెడ్యూల్ కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. నిజానికి నిమ్మగడ్డ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. కానీ.. వరుసగా జరిపిన ఎన్నికల్లో అధికార వైసీపీ అఖండ విజయం సాధించడం, ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పడం కూడా నిమ్మగడ్డ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వెనకడుగు వేయడానికి కారణమయింది.

    మరోవైపు.. ప్రివిలేజ్ కమిటీ నోటీసులు కూడా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌‌ను ఇబ్బంది పెట్టాయని టాక్‌. తనను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని నిమ్మగడ్డ భావించారు. ఇక ప్రభుత్వంతో తనకు పడదని భావించిన ఆయన.. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. నిజానికి ఇన్ని ఎన్నికలను నిర్వహించిన ఆయనకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం పెద్ద కష్టమైన పని కాదు.

    కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే ఉంది. అయినా.. ప్రభుత్వంతో పేచీ పెట్టుకోవడం ఈ సమయంలో ఎందుకని ఆయన భావించారని తెలుస్తోంది. పైగా ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేస్తుండటంతో తనకెందుకొచ్చిన ఇబ్బంది అని నిమ్మగడ్డ భావించారు. పైగా టీడీపీ, జనసేన వంటి పార్టీలు కూడా నిమ్మగడ్డ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయట. అందుకే ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడానికి ఇష్టపడడం లేదు.