
Realestate YCP Leaders: కుక్క ప్రసవించే సమయంలో ఆకలితో తన పిల్లలను తానే తినేస్తుంది. విపరీతమైన ఆకలితో ఉండే శునకం కూనలను పొట్టన పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏపీలో కూడా అటువంటి సీన్లే వెలుగు చూస్తున్నాయి. అవినీతి, ఆస్తుల కబ్జాకు అలవాటుపడిపోయిన వైసీపీ నేతలు సొంత పార్టీ నేతలపై పడ్డారు. తర, తమ అన్న భేదం లేకుండా దొరికిన చోట ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదేమంటే బెదిరిస్తున్నారు. యంత్రాంగానికి భయపెడుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలో ఓ దళిత ఎమ్మెల్యే బాధితురాలిగా మిగిలారు. ఆర్టీవో స్థాయి అధికారికి ఆమె మొరపెట్టుకున్నా న్యాయం జరగడం లేదు. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోవడం లేదు.
Also Read: Heart Attacks: విద్యార్థులను కబళిస్తున్న గుండెపోట్లు.. ఎందుకీ ఉపద్రవం
ఆ మధ్యన బద్వేలుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్డర్ సుధ గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆమె భర్త వెంకట సుబ్బయ్య కొవిడ్ తో చనిపోయారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన బద్వేలులో గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అయితే వెంకట సుబ్బయ్య అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నికల అనివార్యంగా మారింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన భార్య డాక్టర్ సుధకు టిక్కెట్ ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెను తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. అందుకే ఆమెకు పార్టీ కార్యక్రమాలకు పెద్దగా పిలవడం లేదు. అసలు పట్టించుకోవడం లేదు.
వృత్తిరీత్యా డాక్టర్ అయిన సుధకు కడప శివార్లలో 27 సెంట్ల విలువైన భూమి ఉంది. దానిపై స్థానిక వైసీపీ నాయకుడు ఒకరు కన్నేశారు. అందులో రెండు సెంట్లు మిగిల్చి.. మిగతా మొత్తాన్ని కబ్జా చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ సవాల్ చేస్తున్నాడు. చివరకు ఎమ్మెల్యే సుధ హైకమాండ్ పెద్దలకు చెప్పినా వారు పెద్దగా పట్టించుకోలేదు, దీంతో ఆర్డీవోను కలిసి తన సమస్యను విన్నవించారు. అయితే అక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు. దీంతో న్యాయ పోరాటానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధ సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే సీటు ఇచ్చి అగౌరవపరుస్తున్నారని ఆమె అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే విషయంలో వైసీపీ భూ మాఫియా నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తుంటే.. మిగతా వారి విషయంలో ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మనసుపడితే ఎంత విలువైన భూములైనా వదులుకోవాల్సిందే. లేకుంటే నానా రకాలుగా ఇబ్బందిపెడతారు. విలువైన రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే సమయంలో వాటాలు అప్పగించుకోవాల్సిందే. లేకుంటే రకరకాలుగా వెంటాడుతారు. అందుకే రియల్ వ్యాపారులు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. అయితే ఈ విషయంలో విమర్శలొస్తాయనో.. ఏమో.. ఎమ్మెల్యే డాక్టర్ సుధకు సెటిల్ చేస్తామని కొందరు పెద్దలు చెప్పినట్టు సమాచారం. అంతవరకూ మీడియాతో మాట్లాడవద్దని షరతు పెట్టినట్టు తెలుస్తోంది.
