https://oktelugu.com/

కరోనా మరణాల వెనుక అసలు రహస్యం అదేనంట..!

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీఒక్కరిని కబలించేందుకు సిద్ధమవుతోంది. కరోనా ధాటికి అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడుతున్నాయి. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా సైతం కరోనాకు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం చెందింది. కరోనాలు మరణాలు అమెరికాలో ఎక్కువగా ఉండటం శోచనీయంగా మారింది. ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, యూకే లాంటి అగ్ర దేశాలు కరోనాపై పోరులో సాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 4, 2020 7:06 pm
    Follow us on


    చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీఒక్కరిని కబలించేందుకు సిద్ధమవుతోంది. కరోనా ధాటికి అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడుతున్నాయి. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా సైతం కరోనాకు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం చెందింది. కరోనాలు మరణాలు అమెరికాలో ఎక్కువగా ఉండటం శోచనీయంగా మారింది. ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, యూకే లాంటి అగ్ర దేశాలు కరోనాపై పోరులో సాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. అయితే కరోనా మరణాలు అధికంగా నమోదు కావడానికి గల కారణాలను తాజాగా బ్రిటన్ కు చెందిన ప్రవాసీ భారతీయ వైద్యుడు వెల్లడించారు.

    దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు!

    బ్రిటన్‌లోని జాతీయ వైద్యసేవా విభాగంలో ముఖ్యమైన వారిలో డాక్టర్ అసీమ్ మల్హోత్రా ఒకరు. భారత సంతతికి చెందిన మల్హోత్రా కరోనా మరణాలకు గల కారణాలను వివరించారు. కరోనాపై పోరాటంలో ప్రతీ ఒక్కరి జీవన విధానంలో మార్పులు అవసరమని ఆయన అన్నారు. కరోనాపై నమోదవుతున్న మరణాల్లో ఎక్కువగా ఊబకాయం, అధిక బరువు కలిగినవారే ఉంటున్నారని తెలిపారు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక కరోనా మరణాలకు వారి ఆహారపు అలవాట్లేనని కారణమని ఆయన స్పష్టంచేశారు.

    విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

    ముఖ్యంగా టైప్-2 మధుమేహం, బీపీ, గుండెజబ్బులు కరోనా మరణాలకు ముఖ్య కారణం అవుతున్నాయన్నారు. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకపోవడం అనేది ప్ర‌ధాన స‌మస్యగా మారిందన్నారు. అమెరికా, బ్రిటన్లో 60శాతం పైగా ప్ర‌జ‌లు స్థూలకాయులేనని ఆయన గుర్తు చేశారు. ఇండియాలోనూ ఇలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనాకు మందులేకపోవడంతో మరణాలను ఎలా అరికట్టాలో తెలియక చాలా దేశాలు సతమతమవుతున్నాయని తెలిపారు. సరైన వాక్సిన్ అందుబాటులో లేకపోవడం, ఆయా దేశాల్లోని ఆహార అలవాట్లు కరోనా మరణాల రేటు పెరగడానికి కారణమని ఆయన వివరించారు. సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవన విధానాన్ని కొన్నిరోజుల్లో సాధించవచ్చన్నారు.