కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందేనా?

అవును.. మీరు అనుకుంటున్నది నిజమే.. కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందే.. లేకపోతే లాక్ డౌన్ 1, 2.0, 3.0ల తర్వాత లాక్ డౌన్ 4.0, 5.0 ఇలా వస్తూనే ఉంటుంది. ఆ కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. కరోనాను లాక్ డౌన్ తో కొంతవరకు ఆపగలం కానీ.. స్వీయ నియంత్రణతోనే దాన్ని నివారింగలమని అందరికీ అర్థమైంది. ఇప్పుడు కోట్ల మంది ఇంట్లో ఉన్నా కరోనా ప్రబలుతోంది. వారు బయటకొస్తే అప్రమత్తంగా ఉంటే అంతే స్థాయిలో […]

Written By: Neelambaram, Updated On : May 4, 2020 7:19 pm
Follow us on


అవును.. మీరు అనుకుంటున్నది నిజమే.. కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందే.. లేకపోతే లాక్ డౌన్ 1, 2.0, 3.0ల తర్వాత లాక్ డౌన్ 4.0, 5.0 ఇలా వస్తూనే ఉంటుంది. ఆ కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. కరోనాను లాక్ డౌన్ తో కొంతవరకు ఆపగలం కానీ.. స్వీయ నియంత్రణతోనే దాన్ని నివారింగలమని అందరికీ అర్థమైంది. ఇప్పుడు కోట్ల మంది ఇంట్లో ఉన్నా కరోనా ప్రబలుతోంది. వారు బయటకొస్తే అప్రమత్తంగా ఉంటే అంతే స్థాయిలో ఉంటుంది. అసలు కరోనా అన్న భయాన్ని వీడి.. దాన్ని ఒక రోగంగా జనాలు భావించి చికిత్సకు రెడీ అయితేనే బెటర్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. లేదంటే ఎన్నాళ్లు ఇలా లోకానికి దూరంగా నాలుగు గోడల మధ్య జనం బతుకుతారు. పిచ్చోళ్లు అయిపోతారు. పనిలేక.. ఉపాధి కరువై.. డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతో చస్తారు. కరోనాతో పోయిన చావులు కంటే ఈ ఆఫ్టర్ కరోనా ఆర్థిక ఇబ్బందులతో చనిపోయే వారి సంఖ్య బాగా ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

*సీఎం జగన్ మాట అక్షరసత్యమేనా?
సీఎం జగన్ ఈ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇటీవలే ఓ మాట అన్నారు. కరోనా కూడా ఒక వ్యాధిలా భావించాలని.. జ్వరంతో పోల్చారు. మానసికంగా దీనికి సిద్ధపడి జనాలంతా బయటకు రావాలని.. లాక్ డౌన్ ను ఎంతో కాలం కొనసాగించి ప్రజలను ఇళ్లకు పరిమితం చేయడం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు.

దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు!

*జగన్ అన్నట్టే సాగుతోందిగా..
సీఎం జగన్ ఇటీవల ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లోనూ లాక్ డౌన్ ఎత్తివేయాలని.. సడలింపులు ఇవ్వాలని.. దిగజారిన ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదాలని.. కరోనా ఓన్ చేసుకొని అందరికీ స్వేచ్ఛ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సీఎం జగన్ చెప్పినట్టే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 48 గంటల్లోనే 5వేల కేసులు పెరిగాయి. దీన్ని లాక్ డౌన్ తో కంట్రోల్ చేయడం కష్టమని తేలింది.

*స్వీయ నియంత్రణతో ఎవరి పనులు వారు చేస్తే బెటర్
కరోనాను లాక్ డౌన్ తో కంట్రోల్ చేయలేం. అందుకే ప్రజలు కరోనాకు భయపడకుండా వారిని మానసికంగా ప్రభుత్వాలు సిద్దం చేయాలి. అది సాధారణ జలుబు, జ్వరంగా భావించి చికిత్సకు రెడీ అయ్యి అందరూ పనులకు రావాలి చేసుకోవాలి. లేదంటే నెలలకు నెలలు కూర్చొని తిన్నా తరగిపోకపోవడానికి మనకు తాతలు సంపాదించిన ఆస్తులు లేవు. చేసుకుంటేనే పని. అందుకే లాక్ డౌన్ ను దేశంలో ఎత్తివేసి స్వీయ నియంత్రణ, జాగ్రత్తలు తీసుకొని సామూహికంగా ఉండే థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, బార్స్, రెస్టారెంట్లను మినహాయించి అన్ని పనులు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలి. లేదంటా ప్రజలు ఆర్థికంగా, మానసికంగా కుదేలయ్యే అవకాశాలు లేకపోలేదు.. సో ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

–నరేశ్ ఎన్నం