దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు!

దేశంలో రోజు రోజుకి కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,074 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం వరకు మొత్తం 11,706 కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క రోజులో ఇంత ఎక్కువ స్థాయిలో కోవిడ్‌-19 నుంచి బాధితులు కోలుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.  ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 27.52 శాతంగా ఉన్నట్లు  ప్రకటించింది. గత 24 […]

Written By: Neelambaram, Updated On : May 4, 2020 7:04 pm
Follow us on

దేశంలో రోజు రోజుకి కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,074 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం వరకు మొత్తం 11,706 కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క రోజులో ఇంత ఎక్కువ స్థాయిలో కోవిడ్‌-19 నుంచి బాధితులు కోలుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.  ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 27.52 శాతంగా ఉన్నట్లు  ప్రకటించింది.

గత 24 గంటల్లో  కొత్తగా 2,553 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 42,533కు పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 29,453 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల 1389 మంది మరణించారు.  మహారాష్ట్ర(12974), గుజరాత్‌(5428), ఢిల్లీ(4549), తమిళనాడు(3023) రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.