RC Challan : సాధారణంగా బైక్ ను బయటకు తీసినప్పుడు మొదలు హెల్మెట్, ఆర్సీ, పొల్యుషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో చూస్తాం. ఆ తర్వాత బండిని స్టార్ట్ చేసి బయలుదేరుతాము. కానీ వాహనం నడిపే వ్యక్తికి అవి లేకపోతే లేకపోతే మన జేబుకు చిల్లుపడినట్లే.. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకపోయినా.. వాహనానికి సంబంధించి ఆర్సీ, లైసెన్స్, పొల్యూషన్ ఇవన్నింటిలో ఏది లేకపోయినా ఫైన్ పడుతుంది. అందుకే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్లాలి. లేకుంటే పోలీసు తనిఖీల సమయంలో మిమ్మల్ని ఆపితే, ట్రాఫిక్ చలాన్‌లో వేల రూపాయల జరిమానా విధించవచ్చు. ఏదైనా వాహనం నడుపుతున్నప్పుడు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, RC, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ కాపీ ఉండాలి. ఈ పత్రాలలో ఏదైనా ఒకటి తప్పిపోతే మీకు వేలల్లో నష్టం జరగవచ్చు.
RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) లేకుండా కారు లేదా ఏదైనా వాహనాన్ని నడిపితే, మీరు ఎంత చలాన్ చెల్లించాలి? దీనితో పాటు, మోటారు వాహన చట్టంలోని ఏ సెక్షన్ కింద పోలీసులు మీపై చలాన్ జారీ చేయవచ్చో కూడా తెలుసుకుందాం. మీ దగ్గర ఎటువంటి కాగితాలు లేకపోయినా మీరు సేఫ్ గా ఉండేందుకు ఒక మార్గం కూడా ఉంది. అందేంటో చూద్దాం.
మోటారు వాహన చట్టం: ఏ సెక్షన్ కింద చలాన్?
మీరు RC లేకుండా వాహనం నడిపితే మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 39/192 ప్రకారం జరిమానా విధించబడుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు మొదటిసారి చేసే పొరపాటుకు రూ. 5,000 చలాన్ విధించబడుతుంది. కానీ మీరు తప్పును పునరావృతం చేస్తే జరిమానా మొత్తం రెట్టింపు అవుతుంది. రెండవసారి తప్పు చేస్తే, మీరు రూ. 10,000 చలాన్ చెల్లించాలి.
RC చలాన్‌ను ఎలా నివారించాలి?
మీరు డ్రైవింగ్ చేసే ముందు ఆర్‌సి తీసుకోవడం మర్చిపోతే, మీరు మీ ఫోన్‌లో డిజిలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. డిజిలాకర్ యాప్‌లో మీరు ఆర్‌సి (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) మాత్రమే కాకుండా మీ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సురెన్స్ కాపీ, పొల్యూషన్ సర్టిఫిట్ వంటి అన్ని అవసరమైన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. డిజిలాకర్‌లో డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసిన తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలీసు తనిఖీల సమయంలో మిమ్మల్ని ఆపివేసినట్లయితే, మీరు యాప్‌లోని డాక్యుమెంట్ కాపీని చూపించవచ్చు. డిజిలాకర్ ఒక ప్రభుత్వ యాప్. కాబట్టి మీ అన్ని పత్రాలు అందులో సేఫ్ గా ఉంటాయి.