Auto Expo 2025 : ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండవ ఎడిషన్ ఈరోజు అంటే జనవరి 17న ప్రారంభం అయింది. ఈ కార్యక్రమం మొత్తం మొబిలిటీ రంగానికి చాలా ప్రత్యేకమైనది. భారత్ మండపంలో జరగనున్న ఈ కార్యక్రమంలో టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహన పోర్ట్‌ఫోలియోను, కొన్ని ప్రత్యేక వేరియంట్‌లతో పాటు గ్రీన్ ఫ్యూయల్ టెక్నాలజీని పరిచయం చేయబోతోంది.
టాటా హారియర్ ఈవీ
ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించబడే కార్లలో మొదటి పేరు టాటా హారియర్ ఈవీ. టాటా హారియర్ ఈవీ అనేది టాటా మోటార్స్ నుండి వచ్చే ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV, ఇది ఆటో ఎక్స్‌పో 2025 ముఖ్యాంశాలలో ఒకటి అవుతుంది. ఈ ఈవీ క్లోజ్డ్ గ్రిల్, కొత్త ఏరోడైనమిక్ వీల్ డిజైన్ కలిగి ఉంటుంది. టాటా హారియర్ రెండు బ్యాటరీ ప్యాక్‌లను పొందే అవకాశం ఉంది, వీటిలో 60 KWh, 80 kWh ఆఫ్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్, బ్యాక్ రేర్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ తో రానుంది.
టాటా సియెర్రా ఈవీ
ఈ ఆటో ఎక్స్‌పోలో మరో పెద్ద ఆకర్షణ టాటా సియెర్రా ఈవీ, దీని ఆధునిక రూపం సియెర్రా ఈవీ. దీనిలో 5-డోర్ల లేఅవుట్ పొందుతారు. ఇది మరింత ఆచరణాత్మకంగా చేస్తుంది. సియెర్రా ఈవీ టాటా హారియర్, సఫారీ ఈవీ లాంటి సాంకేతికతతో అమర్చబడే అవకాశం ఉంది. దీని ICE వేరియంట్‌ను కూడా తరువాత ప్రవేశపెట్టవచ్చు. టాటా సియెర్రా ఈవీ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతోంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
టాటా నుండి వచ్చిన మూడవ కారు పంచ్ ఫేస్‌లిఫ్ట్. ఇతర SUVలతో పాటు, టాటా తన రికార్డ్ బ్రేకింగ్ కారు టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రవేశపెట్టవచ్చు. పంచ్ కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారు. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడే టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
టాటా సఫారీ ఈవీ, ICE
నాల్గవ కారు టాటా సఫారీ, ఇది కంపెనీ ప్రసిద్ధ 7 సీట్ల SUV. టాటా సఫారీ ఎలక్ట్రిక్ వేరియంట్ 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టబడుతుంది. దీనితో పాటు, టాటా సఫారీ కొత్త పెట్రోల్ వేరియంట్‌ను కూడా ఎక్స్‌పోలో ప్రవేశపెట్టవచ్చు. కొత్త టాటా సఫారీలో టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించవచ్చు.
టాటా అవిన్య
మరో కారు టాటా అవిన్య, ఇది ఇప్పటికీ కాన్సెప్ట్ కారుగానే ఉంది. త్వరలో ఈ కారు ప్రొడక్షన్ మోడల్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కారు ఫీచర్స్, పవర్‌ట్రెయిన్ గురించి స్పష్టంగా తెలియదు.