Ustad Bhagat Singh Villain: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పెను రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ సినిమాగా నిలిచింది. 10 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ కి భారీ సక్సెస్ ని అందించిన సినిమా కూడా అదే కావడం విశేషం…మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నారు అంటూ సగటు ప్రేక్షకులు సైతం కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు… ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టోరీని కొంతవరకు మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తోంది. అప్పుడెప్పుడో స్టార్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు కొన్ని మార్పులతో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది… యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
Also Read: కింగ్డమ్ ఎన్ని కోట్లు వసూలు చేస్తే విజయ్ టైర్ వన్ హీరోగా మారుతాడో తెలుసా..?
గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తూ ఆయనలా మాట్లాడాడు. ఈ విషయం అప్పట్లో పెను సంచలనాన్ని రేకెత్తించింది. ఒక రకంగా రాజశేఖర్ సైతం పవన్ కళ్యాణ్ తనను ఇమిటేట్ చేయడం పైన కొంతవరకు సీరియస్ అయ్యారు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా రాజశేఖర్ పొలిటికల్ గా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను విమర్శించాడు… అయినప్పటికి మళ్ళీ వీళ్ళ మధ్య మాటలైతే కలిసిపోయాయి. చిరంజీవి మీద ఎప్పటికప్పుడు కొన్ని విమర్శలు చేస్తూ వచ్చిన రాజశేఖర్ ఇప్పుడు కామ్ అయిపోయాడు…
ఆ తరహాలోనే ఒక పవర్ఫుల్ పాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ రీసెంట్గా వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమాతో డివైడ్ టాక్ ను తెచ్చుకున్నాడు.
Also Read: నాని ప్యారడైజ్ స్టోరీ ని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..?
సెప్టెంబర్ 25వ తేదీన ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి పాన్ ఇండియాలో తన ప్రతాపం ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది సరైన డేట్ అయితే అనౌన్స్ చేయనప్పటికి వచ్చే ఏడాది మాత్రం ఈ సినిమాను పక్కాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అటు పవన్ కళ్యాణ్, ఇటు హరీష్ శంకర్ తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు…