
సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం పనులు ప్రారంబించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య నెలకొన్న జల వివాదాల నేపథ్యంలో కేంద్రం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోల్పోయింది. ఆ ప్రాజెక్టును కేంద్రం విడుదల చేసిన బోర్డుల గెజిట్ లో చోటు దక్కలేదు. అంటే ఆ ప్రాజెక్టు ఉనికిని కేంద్రం గుర్తించలేదని తెలుస్తోంది. దీంతో ఏపీ సర్కారుకు మింగుడు పడడం లేదు.
ఏ ప్రాజెక్టు కారణంగా వివాదం చెలరేగిందో ఆ ప్రాజెక్టునే పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రభుత్వానికి చెంపపెట్టే. భవిష్యత్ లో కూడా దాని నిర్మాణం చేపట్టే అవకాశం ఉండకపోవచ్చనే విషయం తెలుస్తోంది. ఒక వేళ నిర్మించాలంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయించుకుని ఆమోదం పొందితేనే సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కట్టవద్దని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. దీంతో నీటి వినియోగంలో తెలంగాణ, ఏపీలో వివాదం నడుస్తోంది. రాయలసీమ ప్రాజెక్టు కట్టి తీరుతామని ఏపీ చెబుతుండగా తెలంగాణ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేఆర్ఎంబీని చివరికి ఎన్డీటీని కూడా ఏపీ సర్కారు పట్టించుకోలేదు. స్టే ఉన్నా అక్కడ పనులు జోరుగా సాగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. అందుకే సర్కారుపై హైకోర్టు ధిక్కరణ కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఇప్పుడు అసలు కృష్ణా ప్రాజెక్ట్లుల్లో ఆ ఎత్తిపోతలకు చోటు దక్కకపోవడం గమనార్హం.
నదీ యాజమాన్య బోర్డులు కేంద్రం చేతుల్లోకి వెళ్లడంతో ఏ ప్రాజెక్టు ఎంత నీటిని విడుదల చేయాలనేది ఆయాబోర్డులే నిర్ణయిస్తాయి. అవి ఒప్పందాల ప్రకారం ఉంటాయి. ఈ ప్రకారం నీటిని విడుదల చేస్తాయి. ఈ ప్రకారంగా చూస్తే వేల కోట్లు పెట్టి రాయలసీమ ప్రాజెక్టు కట్టినా నీరు తోడుకోవడానికి అవకాశమే ఉండదు. ఆ కోట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరే అంటున్నారు. ఏపీ సర్కారు మాత్రం ఏం చేసినా ఇలాగే అవుతుండడం ఇది మొదటిసారి కాదు.