https://oktelugu.com/

ప్ర‌దీప్ కాబోయే భార్య ఆమే.. ఫొటోతో వ‌చ్చేసిన‌ యాంక‌ర్!

యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌ని వారు లేరు. ఎఫ్ఎమ్ సంస్థలో జాకీగా కెరీర్‌ మొద‌లు పెట్టిన‌ ప్రదీప్.. ఆ తర్వాత ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్’ అనే గేమ్‌ షోతో యాంకర్‌గా మారిపోయాడు. అనంత‌రం ‘గడసరి అత్త సొగసరి కోడలు’ అనే షోతో టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అలా జోరందుకుందున్న‌ ప్ర‌దీప్ కెరీర్‌.. నిరంత‌రాయంగా కొన‌సాగుతూనే ఉంది. అద్దిరిపోయే టైమింగ్‌తో పంచులు.. త‌న‌దైన వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ తెలుగులో నెంబ‌ర్ వ‌న్ మేల్‌ యాంక‌ర్ గా […]

Written By:
  • Rocky
  • , Updated On : July 18, 2021 / 04:19 PM IST
    Follow us on

    యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌ని వారు లేరు. ఎఫ్ఎమ్ సంస్థలో జాకీగా కెరీర్‌ మొద‌లు పెట్టిన‌ ప్రదీప్.. ఆ తర్వాత ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్’ అనే గేమ్‌ షోతో యాంకర్‌గా మారిపోయాడు. అనంత‌రం ‘గడసరి అత్త సొగసరి కోడలు’ అనే షోతో టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అలా జోరందుకుందున్న‌ ప్ర‌దీప్ కెరీర్‌.. నిరంత‌రాయంగా కొన‌సాగుతూనే ఉంది. అద్దిరిపోయే టైమింగ్‌తో పంచులు.. త‌న‌దైన వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ తెలుగులో నెంబ‌ర్ వ‌న్ మేల్‌ యాంక‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు.

    అతి తక్కువ సమయంలోనే నెంబ‌ర్ వ‌న్‌ యాంకర్ గా ఎదిగిన ప్రదీప్.. స్మాల్ స్క్రీన్ పై వరుస ఆఫర్లు అందుకున్నాడు. ఈ వ‌రుస‌లోనే.. ‘ప్రదీప్ దర్భార్’, ‘అదుర్స్, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘నర్తనశాల’, ‘డ్రామా జూనియర్స్’ ‘కిక్’, ‘సరిగమప’, ఢీ వంటి టీవీ షోలలో సత్తా చాటాడు. అదేవిధంగా కొన్ని సినిమాల్లోనూ చిన్న పాత్ర‌ల్లో నటించి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే.. హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు ప్ర‌దీప్. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌దీప్ కు పెళ్లి కాలేద‌న్న సంగ‌తి అందరికీ తెలుసు. ఈ విష‌య‌మై షోల‌లో జోకులు కూడా పేలుతుంటాయి.

    అలాంటి ప్ర‌దీప్‌.. త‌న‌కు కాబోయే భార్య అంటూ ఫొటోతో సంద‌డి చేశాడు. ప్ర‌స్తుతం జీ తెలుగులో ‘సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్.’ అనే షో చేస్తున్నాడు ప్రదీప్. ఇందులో రాబోయే ఆదివారం ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్లో త్రిన‌య‌ని – సూర్య‌కాంతం సీరియ‌ల్స్ లో న‌టించే న‌టుల మ‌ధ్య పోటీ జ‌ర‌గ‌నుంది. ఈ పోటీకి సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

    ఇందులో ప్ర‌దీప్ త‌న‌కు కాబోయే భార్య అంటూ ఓ ఫొటో ప‌ట్టుకొని హ‌ల్ చ‌ల్ చేశాడు. మ‌హేష్ బాబు న‌టించిన మురారి చిత్రంలోని ‘‘ఎక్క‌డ ఉందో తార‌కా..’’ అనే పాటతో ప్ర‌దీప్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ స‌మ‌యంలో ఓ ఫొటోతో ద‌ర్శ‌న‌మిచ్చాడు. అంతేకాదు.. ఈ రోజు కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరుకుతుంది అని అన్నాడు. ‘‘ఆ అమ్మాయి ఎవ‌రో గానీ.. నీ కంటే హైట్ ఎక్కు ఉంది’’ అని ఓ న‌టి కామెంట్ చేసింది. దీంతో.. ప్రోమో రచ్చగా మారింది. మరి, ఆ అమ్మాయి ఎవ‌రో తెలియాలంటే.. ఆ ప్రోగ్రామ్ ఫినిష్ కావాల్సిందే.