https://oktelugu.com/

మళ్లీ రవి ప్రకాష్‌ చేతికి టీవీ 9..?

టీవీ9 మళ్లీ రవిప్రకాష్‌ చేతికి వెళ్లనుందా..? ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన చానల్‌ను మళ్లీ లాభాల బాట పట్టించాలంటే రవిప్రకాష్‌ ఎంట్రీ తప్పదా..? టీవీ9ను బతికించుకోవాలంటే రవిప్రకాష్‌తోనే సాధ్యమా..? చానల్‌లోకి వెళ్లేందుకు ఆయన మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారా..? ఈ ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సమాధానాలే వస్తున్నాయి. Also Read: బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు ఒకప్పుడు బ్రేకింగ్‌ న్యూస్‌లకు కేరాఫ్‌గా నిలిచిన టీవీ9.. ఇప్పుడు అదే బ్రేకింగ్‌ న్యూస్‌లా మారింది. అప్పట్లో చానల్‌ వ్యవహారం చాలా సీరియస్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2020 / 09:13 AM IST

    Raviprakash

    Follow us on

    టీవీ9 మళ్లీ రవిప్రకాష్‌ చేతికి వెళ్లనుందా..? ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన చానల్‌ను మళ్లీ లాభాల బాట పట్టించాలంటే రవిప్రకాష్‌ ఎంట్రీ తప్పదా..? టీవీ9ను బతికించుకోవాలంటే రవిప్రకాష్‌తోనే సాధ్యమా..? చానల్‌లోకి వెళ్లేందుకు ఆయన మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారా..? ఈ ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సమాధానాలే వస్తున్నాయి.

    Also Read: బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు

    ఒకప్పుడు బ్రేకింగ్‌ న్యూస్‌లకు కేరాఫ్‌గా నిలిచిన టీవీ9.. ఇప్పుడు అదే బ్రేకింగ్‌ న్యూస్‌లా మారింది. అప్పట్లో చానల్‌ వ్యవహారం చాలా సీరియస్‌ అయ్యింది. కేసుల వరకూ వెళ్లింది. చానల్‌ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో రవిప్రకాష్‌ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. రవిప్రకాష్‌ సీఈవోగా టీవీ9ను ఏళ్ల పాటు నడిపించారు. చాలా భాషల్లోనూ విస్తరించారు. తెలుగులో కూడా టీవీ 1 పేరుతో మరో చానల్‌ కూడా తీసుకొచ్చారు. వీటితోపాటు మోజో చానల్‌ను కూడా వచ్చింది.

    మొదటి నుంచి మంచి లాభాల్లో ఉన్న టీవీ9ను పలు పరిణామాల దృష్ట్యా మేఘా కృష్ణారెడ్డి, జూపల్లి కృష్ణారావు బ్యాచ్‌ కొనుగోలు చేసింది. టీఆర్‌‌ఎస్‌ గవర్నమెంట్‌పై వ్యతిరేక వార్తలు ఇస్తున్నారనే నెపంతో ఈ బ్యాచ్‌ వచ్చీ రాగానే రవిప్రకాష్‌పై కేసులు పెట్టించింది. అక్రమంగా చానల్‌ షేర్లు సొంతం చేసుకున్నాడని రవి ప్రకాష్‌పై భారీగానే కేసులు ఫైల్‌ చేయించింది.

    ఆ వెంటవెంటనే కృష్ణారెడ్డి, కృష్ణారావు బ్యాచ్‌ టీవీ1ను ఎత్తేశారు. రవిప్రకాష్‌ నడిపిస్తున్నారని ప్రచారంలో ఉన్న మోజో టీవీనీ తమ చేతుల్లోకి లాగేసుకుని లాక్‌ చేసేశారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కొత్త మేనేజ్‌మెంట్‌ మాత్రం తమకు భారం తగ్గిందని ఆనందపడింది. అయితే.. ఆ సంతోషం కూడా వారికి ఎన్ని రోజులు నిలవలేదు.

    ప్రస్తుతం టీవీ9 భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది. అసలే కరోనా.. ఆపై మెయింటనెన్స్‌ లోపంతో చానల్‌కు కోలుకోలేని దెబ్బపడిందని తెలిసింది. కొత్త మేనేజ్‌మెంట్‌ చేతుల్లోకి తీసుకున్న కొద్ది రోజుల్లోనే నష్టాలను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టీవీ9ను గుజరాత్‌ను మూసివేయాలని ప్లాన్‌ చేస్తున్నారట.

    Also Read: హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?

    అయితే.. ఇలాంటి టైంలోనే మళ్లీ టీవీ9లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రవిప్రకాష్‌ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అడుగు పెట్టడమే కాదు.. ఏకంగా టేకోవర్‌‌ చేయాలని భావిస్తున్నారట. జర్నలిస్టులు నడపాల్సిన చానల్‌ను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నడిపిస్తున్నారు. అందుకే ఈ నష్టాలంటూ రవిప్రకాష్‌ అభిప్రాయపడుతున్నారు. ఎలాగూ చానల్‌లో తానూ ఓ వాటాదారునే కాబట్టి.. చానల్‌ను టేకోవర్‌‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కంపెనీస్‌ లా ట్రిబ్యునల్‌లో రవిప్రకాష్‌ కేసు వేశారట.

    ఇదిలా ఉండగా.. టీవీ9 నుంచి రవిప్రకాష్‌ను తప్పించాలనే ఛాలెంజ్‌తోనే మైహోం అండ్‌ మేఘా టీం చానల్‌ను కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు మళ్లీ రవిప్రకాష్‌ చేతుల్లో ఎలా పెడుతారనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది.