బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?

వయసు అనేది పాదరసం లాంటిది. మెరుపు వేగంతో పోతూనే ఉంటుంది. దాన్ని పట్టుకోవాలనుకోవడం కాని పని. అలా.. జీవితంలో కొన్ని సాధించలేని పనులు గుర్తుకొచ్చినప్పుడల్లా వయసు కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ వయసులో ఉండగానే ఆ పని చేస్తే బాగుండేది అనే అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. 70 ఏళ్ల ఏజ్‌లో 25 ఏళ్ల యువకుడిలా పని చేయాలంటే ఎవరికీ సాధ్యపడదు. అందుకే..‘ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి’ అంటారు. ఏ ‘వయసులో […]

Written By: NARESH, Updated On : September 15, 2020 9:44 am
Follow us on

వయసు అనేది పాదరసం లాంటిది. మెరుపు వేగంతో పోతూనే ఉంటుంది. దాన్ని పట్టుకోవాలనుకోవడం కాని పని. అలా.. జీవితంలో కొన్ని సాధించలేని పనులు గుర్తుకొచ్చినప్పుడల్లా వయసు కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ వయసులో ఉండగానే ఆ పని చేస్తే బాగుండేది అనే అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. 70 ఏళ్ల ఏజ్‌లో 25 ఏళ్ల యువకుడిలా పని చేయాలంటే ఎవరికీ సాధ్యపడదు. అందుకే..‘ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి’ అంటారు. ఏ ‘వయసులో సాధించాల్సిన లక్ష్యాన్ని ఆ వయసులో సాధించాలి’ అని అంటుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆ రందీనే మోపైంది. ముఖ్యంగా ఆ రందీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పెద్ద ఎత్తున వెంటాడుతోంది.

Also Read: బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు

తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 ఏళ్లకు దగ్గరవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు వయసు 70 ఏళ్లు. ఇక ఆ పార్టీలో సెకండ్‌ లీడర్‌‌ అంటూ చెప్పుకోదగ్గ వారు ఎవరూ లేరు. అందుకే అధికార పక్షమైన వైసీపీ కూడా ఆయన వయసు మీద ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉంటుంది. ‘తనకు వయసు అయిపోతోందని తొందరగా ఎన్నికలు పెట్టమంటే పెట్టేస్తారా’ అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంటున్నారు. జమిలి ఎన్నికలు అంటూ చంద్రబాబు కలవరింతల‌ వెనక వయసు బెంగ కూడా ఉందని హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుతో చెడుగుడు ఆడుతున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు. తాను అనుకున్నపుడ‌ల్లా ఎన్నికలు రావడానికి ఇది చంద్రబాబు రాసిన రాజ్యాంగం కాదనేది గుర్తుపెట్టుకోవాలని హితవు బోధించారు. జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు అని, అందుకే ఎన్నికలు అంటున్నారని బొత్స అభిప్రాయపడ్డారు. మళ్లీ ఎన్నికలకు పోతే ఇప్పుడు వచ్చిన ఆ 23 సీట్లు కూడా రావని, మూడో నాలుగుకో పరిమితం కావాల్సి వస్తుందని జోస్యం చెబుతున్నారు.

Also Read: హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?

మూడుసార్లు అధికారంలో ఉండిపోయిన చంద్రబాబుకు ఈసారి ప్రతిపక్షంలో ఉండడం మింగుడు పడడం లేదు. సీనియర్ మోస్ట్ లీడర్‌‌ అయిన బాబు ప్రజాస్వామిక పద్ధతులనూ గౌరవించకపోవడం ఏంటని రాజకీయాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీసి జనాలకు మేలు చేసేలా పనిచేద్దామన్న ధ్యాస బాబుకు ఎందుకు లేదన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బాబు ఎంత కోరుకున్నా మోడీ తలచుకోకపోతే జమిలి ఎన్నికలు జరగవు. ఒకవేళ తలచుకున్నా 2023 వరకూ ఎన్నికలు ఉండవని ఢిల్లీ నుంచి వినిపిస్తున్న మాట. అంటే చంద్రబాబు ఎంత ఆయాస‌పడినా జమిలి ఎన్నికలకు కూడా మరో నాలుగేళ్లు కచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి తీరాల్సిందే. వయసు తనకు భారమనిపిస్తే కుమారుడికో లేక మరో సమర్ధుడికో పార్టీ పగ్గాలు అప్పచెప్పి మానిటరింగ్ చేసుకోవడమే బాబుకు ఉత్తమ మార్గమని విశ్లేషకులు సూచిస్తున్నారు.