భారీ చిత్రాల సంస్థలో కొత్త డైరెక్టర్లు !

యూవీ క్రియేష‌న్స్ అనే బ్యానర్ కి టాలీవుడ్ లో ఓ విలువ ఉంది. భారీ చిత్రాల ‘సినిమా సంస్థ’గా వెలిగిపోతుంది. మిర్చి, సాహో లాంటి భారీ సినిమాలు ఎవరి సపోర్ట్ లేకుండా నిర్మించే కెపాసిటీ.. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో యూవీ క్రియేష‌న్స్ కు తప్ప మరో సంస్థకి లేదేమో . ప్రస్తుతం రాధే శ్యామ్‌ నిర్మాణంలో ఉన్నప్పటికీ.. ఆ సినిమా తప్ప ఇంతవరకూ మరో భారీ సినిమాని సెట్ చేసుకోలేదు. ఇప్పటికే ప్రభాస్ నాగ్ అశ్విన్ తో అశ్విన్ […]

Written By: admin, Updated On : August 5, 2020 10:57 am
Follow us on


యూవీ క్రియేష‌న్స్ అనే బ్యానర్ కి టాలీవుడ్ లో ఓ విలువ ఉంది. భారీ చిత్రాల ‘సినిమా సంస్థ’గా వెలిగిపోతుంది. మిర్చి, సాహో లాంటి భారీ సినిమాలు ఎవరి సపోర్ట్ లేకుండా నిర్మించే కెపాసిటీ.. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో యూవీ క్రియేష‌న్స్ కు తప్ప మరో సంస్థకి లేదేమో . ప్రస్తుతం రాధే శ్యామ్‌ నిర్మాణంలో ఉన్నప్పటికీ.. ఆ సినిమా తప్ప ఇంతవరకూ మరో భారీ సినిమాని సెట్ చేసుకోలేదు. ఇప్పటికే ప్రభాస్ నాగ్ అశ్విన్ తో అశ్విన్ దత్ బ్యానర్ లో సినిమాకి కమిట్ అయ్యాడు. మరో రెండేళ్లు దాకా ప్రభాస్ డేట్స్ ఖాళీ లేవు.

Also Read: రానా- మిహీకా పెళ్లి.. కండిషన్స్‌ అప్లై!

దాంతో యూవీకి ఇక మిగిలింది రామ్ చరణ్ డేట్ లే. చరణ్ యూవీకి ఒక సినిమా చేయాలి. కానీ రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ఆ సినిమాకి చినబాబు నిర్మాత అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా యూవీకి భారీ సినిమాలు లేవు. అందుకే యూవీ ఇక నుండి వరుసగా వెబ్ సిరీస్ లను అండ్ చిన్న సినిమాల మీద దృష్టి పెడుతోందట. ఇప్పటికే కొత్త డైరక్టర్లను కొంతమందిని రెడీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: క్రేజీ ఆఫర్ కొట్టేసిన మహేశ్‌ హీరోయిన్‌!

నిజానికి కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూ చిన్న సినిమాలు చేసే కంటే కూడా, మారుతి లాంటి డైరెక్టర్ డైరక్షన్ లో నాని లాంటి హీరోను పెట్టి సినిమాని చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. చిన్న సినిమాలు నాలుగు ప్రాజెక్టులు చేసినా వాటిలో ఎన్ని సక్సెస్ అవుతాయో చెప్పలేము. అదే నాని లాంటి హీరో సినిమాని ముందే లాభాలకు అమ్ముకోవచ్చు. లాభం కోసం ఇన్ని అవకాశాలు ఉన్నా.. ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లు రావాలని.. అది తమ సంస్థ ద్వారే రావాలని యూవీ సంస్థ ప్లాన్ చేస్తోంది.