Ration Cards: కేంద్రం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇవి ప్రజలకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఉన్నాయి. వీటిలో భాగంగా ఆహార భద్రత చట్టం కింద తక్కువ ధరకు రేషన్ అందిస్తోంది. ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతోంది. దీని కింద అర్హత ఉన్న పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తోంది. అయితే ఈ పథకం కింద అర్హత ప్రమాణాలు పాటించే వ్యక్తులకే ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డుదారులకు కొత్త మార్గదర్శకాలు(New Guidliens) విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. కొంత మంది రేషన్ కార్డు హోల్డర్లకు మాత్రమే ప్రయోజనాలు అందనున్నాయి. ఫిబ్రవరి 15 తర్వాత ఈ మార్గదర్శకాలను పాటించనివారు రేషన్ పొందలేదు.
ఈ-కేవైసీ తప్పనిసరి..
రేషన్ కార్డుదారులు.. ఆహార భద్రత పథకం కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ కేవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిచేయనివారు రేషన్ పొందలేరు. కొత్త మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం నకిలీ రేషన్ కార్డు హోల్డర్లను గుర్తించడం. ఈ–కేవైసీ(e-Kyc) ద్వారా ప్రభుత్వం నకిలీ రేషన్ కార్డు హోల్డర్లను గుర్తిస్తుంది. వీరిని పథకం నుంచి తొలిస్తుంది. ఇది నిజమైన అర్హులకు ప్రయోజనం అందుతుంది. ఈ–కేవైసీ పూర్తి చేయాలంటే సమీపంలోని ఆహార సరఫరా కేంద్రానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
గడువులోగా పూర్తి చేస్తేనే రేషన్..
ఫిబ్రవరి 15 వరకు ఈ కేవైసీ పూర్తి చేసినవారికి రేషన్ సరఫరా కొనసాగుతుంది. లేదంటే.. మార్చి నుంచి రేషన్ నిలిపివేస్తారు. ఈ మార్గదర్శకాలు ప్రజల కోసం రేషన్ పథకం సద్వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు నిజమైన అర్హులకు లబ్ధి చేకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం పేర్కొంటోంది. అనేక మంది రేషన్ కార్డు హోల్డర్లు చనిపోయారు. అయినా వారి పేరిట ఇతర కుటుంబ సభ్యులు రేషన్ పొందుతున్నారు. ఇక చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. వారు కూడా రేషన్ కార్డుల్లో సభ్యులుగా ఉన్నారు. అలాంటి వారు కూడా ఈ కేవైసీ చేసుకోలేరు. దీంతో వీరు అటోమేటిక్‌గా రేషన్ వదులుకుంటారు. దీంతో నిజమైన లబ్ధిదారులకు రేషన్ అందుతుంది.