Ratan Tata Passed Away: వ్యాపారం అందరూ చేస్తారు. లాభాల కోసం పరుగులు పెట్టి విలువలను వదిలేస్తారు. జనాలను మోసం చేస్తూ అంతకంతకు విస్తరిస్తుంటారు. సమాజంలో పేరుపొందిన వ్యక్తులుగా చలామణి అవుతుంటారు. మనదేశంలో పేరుపొందిన సంస్థలు ఎన్నో ఉన్నాయి.. లక్షల కోట్లకు ఎదిగిన వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారు. కానీ వారందరిలోకి రతన్ టాటా పూర్తి విభిన్నం. ఎందుకంటే వ్యాపారం అనేది లాభాల కోసం కాదని… సామ్రాజ్యం అనేది సుఖాల కోసం కాదని.. దేశం కోసం వ్యాపారం చేయాలని.. దేశ పౌరుల కోసం సామ్రాజ్యాలను సృష్టించాలని నిరూపించిన మహనీయుడు రతన్ టాటా. 1961 లో రతన్ టాటా గ్రూప్ లో చేరారు. ఆ తర్వాత టాటా స్టీల్ కంపెనీలో చిన్న స్థాయి ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైరెక్టర్ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించారు. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఎంత ఎదిగినప్పటికీ ఒదిగి ఉండే గుణం రతన్ టాటాది. 1975 లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. 1991 లో జే ఆర్ డి టాటా తర్వాత టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 2012 డిసెంబర్ 28 పదవి విరమణ చేపట్టే వరకు టాటా సంస్థను విజయవంతంగా ముందుకు నడిపారు. ఆ తర్వాత 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు తాత్కాలిక చైర్మన్ కొనసాగారు. 1991లో చైర్మన్ గా నియమితులయ్య సరికి టాటా గ్రూపులో 250 కంపెనీల వరకు ఉండేవి. ఆయన ఆ తర్వాత వాటి సంఖ్యను 98 కి తగ్గించారు.. కంపెనీల సామర్థ్యాన్ని పెంచారు.. రతన్ టాటా తీసుకున్న అందరి వల్ల టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం 10,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. రతన్ హయాంలోనే టాటా టెలి సర్వీసెస్, టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బేవరేజెస్, ఇండియన్ హోటల్స్, టాటా స్టీల్, టాటా పవర్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలను అగ్రశ్రేణిగా తీర్చిదిద్దారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీది 1000 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం ఉన్న తొలి ఐటి సంస్థగా మలిచారు.
దాతృత్వానికి విపరీతంగా..
రతన్ టాటా తన ఆదాయంలో 65% దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. కరోనా సమయంలో దేశంలో వైద్య సేవలకు తన వంతుగా విరాళం అందించారు. రతన్ హయాంలో “ఇండికా” కారు పురుడు పోసుకుంది. భారత ఆటోమొబైల్ కంపెనీలకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదనే అపవాదుకు తెరదించింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి కంపెనీలను టేక్ ఓవర్ చేసిన రతన్ టాటా.. వాటిని లాభాల బాట పట్టించారు. బ్రిటన్ దేశానికి చెందిన టెట్లి అనే టీ బ్రాండ్ ను కొనుగోలు చేశారు. టాటా స్టీల్ సామర్థ్యాన్ని పెంచారు. బ్రిటిష్ స్టీల్ కంపెనీ కొనుగోలు చేశారు. టాటా స్టీల్ యూరప్ దేశంలో కూడా పరిచయం చేశారు. నానో కారు విషయంలో సైరస్ మిస్త్రీ తో చెలరేగిన వివాదం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మళ్లీ టాటా గ్రూప్ పగ్గాలు రతన్ టాటా చేపట్టాల్సి వచ్చింది.