NTR: సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా సక్సెస్ ల మీదనే వాళ్ళ కెరియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వరుసగా సక్సెస్ లు వస్తే వాళ్లకు ఉన్న క్రేజ్ మరింత పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఫ్లాప్ సినిమాలు వస్తే మాత్రం వాళ్లకు ఉన్న క్రేజ్ పడిపోవడమే కాకుండా వాళ్ళ మార్కెట్ కూడా భారీగా డౌన్ అయిపోయి ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే సినిమా ఇండస్ట్రీలో కథల సెలక్షన్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. కొంతమంది హీరోలు మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సూపర్ సక్సెస్ లను కొడుతుంటే మరి కొంతమంది హీరోలు మాత్రం ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులు ఎలాంటి కథలను కోరుకుంటున్నారో తెలియక కొన్ని విచిత్రమైన కథలను సినిమాలుగా చేస్తూ ప్లాప్ లను మూటఘట్టుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కెరియర్ మొదట్లో ఎన్టీయార్ కి కథల సెలక్షన్ రాదు అని అందరి చేత విమర్శింపబడ్డాడు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక అందులో భాగం గానే స్టోరీ సెలక్షన్ లో తనే టాప్ హీరోగా కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న హీరోలందరికంటే కూడా ముందు వరుసలో ఉన్నాడు. ఇక తను వరుసగా ఏడు సక్సెస్ లను కొట్టి సక్సెస్ రేట్ లో కూడా చాలా వరకు ముందంజ లో ఉన్నాడు.
నిజానికి ఒకప్పుడు ఉన్న ఎన్టీఆర్ కి ఇప్పుడున్న ఎన్టీఆర్ కి చాలా వరకు తేడా ఉందనే చెప్పాలి. ఒక కథను వినగానే అది కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా? లేదా అని జడ్జ్ చేసే అంత నాలెడ్జ్ ను సంపాదించడం అనేది మామూలు విషయం కాదు. ఎప్పుడైతే పూరి జగన్నాథ్ టెంపర్ సినిమా తీశాడో అప్పటినుంచి ఎన్టీఆర్ దశ మారిందనే చెప్పాలి.
అంతకుముందు వరుసగా ఐదారు సినిమాలతో ఫ్లాప్ లను మూటగట్టుకున్న ఆయన టెంపర్ సినిమాతో సక్సెస్ ని సాధించి అప్పటినుంచి విజయాల బాట పట్టి ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్న ఆయన తొందర్లోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్లో కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాలో కూడా తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తద్వారా ఆయన మరింతగా మెప్పించే అవకాశం అయితే దక్కుతుందని వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి నెక్స్ట్ ఆయన చేయబోయే సినిమాలు ఎలాంటి విజయాలను సాధిస్తాయి అనేది…