Aishwarya Rai: చాలా కాలం నుండి నేషనల్ మీడియా లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రూమర్స్ ని అటు ఐశ్వర్య రాయ్ కానీ, అభిషేక్ బచ్చన్ కానీ కచ్చితంగా ఖండించలేదు. అభిషేక్ బచ్చన్ అప్పట్లో ఒకసారి స్పందించి మా మధ్య అలాంటివేమీ లేదు, నేనేంటో తనకి తెలుసు, తనేంటో నాకు తెలుసు, పిచ్చి రూమర్స్ ని నమ్మకండి అని ఒక్కసారి స్పందించాడు. అయితే ఆ తర్వాత ఎన్నో సంఘటనల ఆధారంగా చేసుకొని వీళ్ళు విడిపోయారు అని మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం చేసింది. ముఖ్యంగా అనంత్ అంబానీ పెళ్లి సమయంలో అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం ఒకవైపు, ఐశ్వర్య రాయ్ మరియు ఆమె కూతురు ఒకవైపు ఉన్నారు. ఈ పెళ్లి కార్యక్రమం అయ్యేంత వరకు ఒక్కసారి కూడా వీళ్లిద్దరు కలుసుకోలేదు, దీంతో ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడిపోయారు అనే రూమర్స్ కి మరింత బలాన్ని చేకూర్చింది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే వీళ్ళిద్దరూ ఒక కబడీ మ్యాచ్ ఈవెంట్ కి వచ్చారు. అక్కడ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ తో ఎదో మాట్లాడి వెళ్తాడు. అభిషేక్ మాట్లాడిన వెంటనే ఐశ్వర్య రాయ్ కోపంగా ఎదో వివరిస్తూ మాట్లాడుతుంది. ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూడొచ్చు. ఆ వీడియో లో ఐశ్వర్య రాయ్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే చిన్నపిల్లవాడికి కూడా అర్థం అయిపోతుంది, అక్కడ జరిగిన సందర్భం ఏమిటో. మరోపక్క అభిషేక్ అభిమానులు ఐశ్వర్య రాయ్ పై ట్రోల్స్ వేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్ లో అంత మంది ముందు లాంటి సీరియస్ రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?, అసలు వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి?, అభిషేక్ మామూలుగా మాట్లాడిన ఐశ్వర్య కి నచ్చడం లేదా?, ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఐశ్వర్య రాయ్ కి అభిషేక్ తో విడిపోవాలని ఉంది కానీ, అభిషేక్ కి మాత్రం లేదని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఒకసారి అభిషేక్ బచ్చన్ ఇంస్టాగ్రామ్ లో విడాకుల వ్యవహారం గురించి పెట్టిన ఒక పోస్టు తెగ వైరల్ గా మారింది. విడాకులు తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు అంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. అంటే తనకు విడాకులు ఇష్టం లేదు అని అర్థం వచ్చేలాగా ఆ పోస్ట్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళ బంధం నిలుస్తుందా ,విడిపోతుందా అనేది పక్కన పెడితే, వీళ్ళ మధ్య కచ్చితంగా పెద్ద కోల్డ్ వార్ నడుస్తుంది అనేది మాత్రం నిజం. ఇండియన్ లోనే ఐశ్వర్య , అభిషేక్ జంట మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని పిలవొచ్చు. ఈ జంట ఎల్లపుడూ కలిసి ఉండాలనే కోరుకుంటారు అభిమానులు. మరి కలిసి ఉంటారా లేదా అనేది చూడాలి.