https://oktelugu.com/

రాపాక..ఎందుకు ముసుగులో గుద్దులాటలు!

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని ఏపీ సీఎం జగన్ పలకరించారు. సాధారణంగా సీఎం జగన్ పై రాపాక కి ఒక పాజిటివ్ కార్నర్ ఉంది. ఈ పలకరింపుతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేలా ప్రజల్లో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఇప్పటికే జగన్ నెంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 26, 2020 / 03:46 PM IST
    Follow us on


    జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని ఏపీ సీఎం జగన్ పలకరించారు. సాధారణంగా సీఎం జగన్ పై రాపాక కి ఒక పాజిటివ్ కార్నర్ ఉంది. ఈ పలకరింపుతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేలా ప్రజల్లో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఇప్పటికే జగన్ నెంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా ముఖ్యమంత్రి జగన్ విశేషంగా కృషి చేస్తున్నారని.. ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా, సుభిక్షంగా ఉన్నారన్నారు.

    రాపాక ని జగన్ ఇలా పలకరించారు..

    ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా కాపు నేస్తం నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడివారితో మాట్లాడారు. ఈ క్రమంలో జగన్, “రాపాక అన్న బావున్నారా..” అంటూ పలకరించారు. తర్వాత మిగిలిన వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.

    అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు ఉన్నా.. జగన్ తనను ‘అన్న’ అని పిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాపాక వ్యాఖ్యానించారట. పవన్ ఇప్పటి వరకు తనను అంత ప్రేమతో, ఆప్యాయతతో పిలవలేదని తన అభిమానులు, కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలతో చెప్పి రాపాక భావోద్వేగానికి గురయ్యారట. అంత ప్రేమగా పిలిచే ముఖ్యమంత్రులు కూడా దేశంలో ఉండరని రాపాక చెప్పుకొచ్చారట. అంతేకాదు గతంలో కూడా తనను “ప్రసాద్ అన్న” అని పిలిచారని గుర్తు చేసుకున్నారట.. ఏది ఏమైనా రాపాక “అన్నా..” అనే పిలుపులో మాధుర్యాన్ని అనుభవిస్తున్నారన్న మాట..!