కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ మూవీతో అరంగేట్రం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందివ్వడంతో పాటు ఫస్ట్ సినిమాతో తన రైటింగ్, టేకింగ్, మేకింగ్ స్కిల్స్‌తో ఇండస్ట్రీని ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో ‘సుప్రీమ్’, రవితేజతో ‘రాజా ది గ్రేట్’, వెంకటేశ్- వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్ 2’తో హిట్స్ అందుకొని మరింత పేరు తెచ్చుకున్నాడు. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబును డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. ఆ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకొని ‘సరిలేరు నీకెవ్వరూ’ అనిపించాడు. ప్రస్తుతం ‘ఎఫ్2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్3’ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు అనిల్‌తో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు పోటీ పడుతున్నారు.
చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!
ఇంత క్రేజ్ ఉన్న టైమ్‌లో అనిల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అతను డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రారంభించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం అనిల్ రావిపూడి ఓ కామెడీ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నాడట. కొత్త నటీనటులుతో దీన్ని రూపొందిస్తారని సమాచారం. ‘ఆహా’తో ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి అసోసియేట్ అయ్యాడు. అయితే, డిడికేటెడ్ తెలుగు ఓటీటీ కావడం, ఇతర ఫ్లాట్‌ఫామ్స్ ఇప్పటికే పాపులర్ అయిన నేపథ్యంలో ‘ఆహా’కు అంతగా ఆదరణ లభించడం లేదు. ఎంతో ముందుచూపుతో, భారీ పెట్టుబడితో ఈ ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసిన అరవింద్ దాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలన్ని చూస్తున్నాడు. పలువురు యువ దర్శకులతో సిరీస్‌లు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనిల్‌ను లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. మరి, మెయిన్ స్ట్రీమ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ డైరెక్టర్గా మారుతున్న రావిపూడి.. వెబ్ మీడియాలోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి.