Ramoji Rao Vs Jagan: ఏపీలో ఎల్లో మీడియా తీరే వేరు. అర్జెంటుగా చంద్రబాబు గద్దెనక్కాలి. ఇప్పుడున్న జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత రావాలి. అందుకు ఎంతటి తెగింపుకైనా దిగగల నేర్పరితనం మీడియా సొంతం. అయితే ఈ ప్రయత్నాన్ని ముందే తెలుసుకున్న జగన్ దుష్ట చతుష్టయంతో ఎల్లో మీడియాని పోల్చారు. ముఖ్యంగా రాజగురువు రామోజీరావు తన ఈనాడులో విషపు రాతలతో జగన్ సర్కార్ పై సెగలు కక్కుతున్నారు. గత కొద్దిరోజులుగా ఈనాడు పత్రికలో ఎక్కువ పేజీలను ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలకే కేటాయిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపొందేందుకు ఉన్న మార్గాలన్నింటిపై ఎల్లో మీడియా ఫోకస్ చేసింది. మీడియా విలువలు, ప్రాధాన్యతలు మరిచిపోయి వ్యవహరిస్తోంది. చంద్రబాబు ఏలుబడిలో అసలు తప్పులే జరగలేదన్నట్టు చూపే ప్రయత్నం చేస్తుంది.
ఇటీవల ఈనాడు రాతలను ఒకసారి పరిశీలిస్తే.. మెడికల్ సీట్ల కేటాయింపులు, ఇసుక తవ్వకాలు, భూ కబ్జాలు… ఈ కథనాలే పతాక శీర్షికన వస్తున్నాయి. అయితే వైసిపి ఏలుబడిలో జరగలేదని చెప్పలేం కానీ.. గతంలో ఎన్నడూ జరగలేదని చూపే ప్రయత్నం చేయడం మాత్రం జుగుప్సాకరంగా ఉంది. అందుకే జగన్ ఈనాడు తో పాటు ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ వంటి మీడియా సంస్థల యాజమాన్యాలతో పాటు చంద్రబాబు, పవన్ లను దుష్ట చతుష్టయంగా అభివర్ణించారు. అంటే ముందుగానే ప్రజల్లోకి ఒక విధమైన సంకేతాలను పంపగలిగారు.
అయితే ఎల్లో మీడియా పోకడలు అంతగా పని చేయడం లేదు. సోషల్ మీడియా విస్తృతం అయినా తరువాత జనాలు ఏది నిజం? ఏది అబద్దం? అన్న నిర్ధారణకు వస్తున్నారు.అయితే చంద్రబాబు ఇల్లు మీడియా ద్వారా జగన్ సర్కార్ పై విషం చిమ్మే ప్రయత్నం మానుకోవడం లేదు. అందులో భాగంగానే రాజగురు రామోజీ బరితెగింపు వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. అయితే జగన్ మాత్రం ఈ ప్రతికూల ప్రచారాన్ని అధిగమించి ముందుకు సాగడం అభినందనీయం. ఎప్పుడూ అవే రాతలతో రోత పుట్టించడం వాంఛనీయం కాదన్న విషయాన్ని ఎల్లో మీడియా గ్రహిస్తే మంచిది. అది అంతిమంగా చంద్రబాబుకు నష్టం చేసే ప్రధాన కారణం అవుతుంది.