
Ramoji Rao Vs Suman : మనం పువ్వు విసిరితే మనకే తిరిగి వస్తుంది..రాయి రువ్వితే మనకే తిరిగి తగులుతుంది. ఇప్పుడు ఈ సామెత రామోజీరావుకు వర్తిస్తుంది..ఇది అల్ రెడీ చంద్రబాబు నాయుడికి బోధపడింది. ఈనాడు తిరుగులేని ఆధిపద్యం సంపాదించేందుకు రామోజీరావు ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఏమి చేయకూడదో అవి కూడా చేశారు. సారా వ్యతిరేక ఉద్యమం తెరపైకి తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి పత్రికను ఇబ్బంది పెట్టారు. దాసరి నారాయణరావు పై లేని పోని వార్తలు రాసి ఉదయం పత్రిక మూసివేతకు కారణమయ్యారు. వార్తాపత్రిక అంతం చూశారు. చార్మినార్ కోపరేటివ్ సొసైటీ బ్యాంకు నష్టాలకు మూల కారణమయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీరావు లీలలు ఇన్నిన్ని కావు.
నాడు చంద్రబాబు అండ చూసుకొని రామోజీరావు ఎంతలా రెచ్చిపోయారో తెలుగు ప్రజలకు తెలియంది కాదు. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకొని ఎన్ని రాజకీయాలు నడిపారో చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షి పేపర్ రాకుండి ఉంటే ఇవాళ మీడియా మొత్తం వారి చేతిలోనే ఉండేది. జర్నలిస్టులకు సరైన భత్యం రాకుండా ఉండేది. పోటీ పత్రిక వచ్చింది కాబట్టి రామోజీరావు అసలు రూపం తెలుగు ప్రజలకు కడుతోంది. రామోజీ ఫిలిం సిటీ ద్వారా ఆక్రమించిన అసైన్డ్ భూములు, మార్గదర్శి ద్వారా చేసిన వ్యాపారాలు, అన్నదాత సంచిక రూపంలో చేసిన వసూళ్లు.. ఒకటా రెండా ఏకంగా ఒక పుస్తకం రాయచ్చు.
మన ఏపీ సిఐడి అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు రామోజీరావు మంచం మీద పడుకుని ఉన్నాడు. ముఖంలో కళ లేదు. కళ్ళల్లో కాంతి లేదు. ఎంతోమంది జీవితాలను తన కంటి చూపుతో నిర్దేశించిన రామోజీరావు అలా పడుకొని ఉండటం ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇక్కడే కర్మ సిద్ధాంతం గుర్తుకొచ్చింది. నాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టేందుకు ఈనాడు అలియాస్ రామోజీరావు ఎన్ని రాతలు రాశాడో అందరికీ తెలుసు. నాడు రామారావు ఎంత బాధపడ్డాడో ఆయన చుట్టూ ఉన్నవాళ్ళకు తెలుసు. ఇప్పుడు నాడు రామారావు ఎంత బాధ అనుభవించాడో రామోజీరావు అంతకుమించి అనుభవిస్తున్నాడు.
వాస్తవానికి రామోజీరావులో అహం పాళ్ళు ఎక్కువ. నేనే సర్వాంతర్యామి అనే పోకడ ఎక్కువ. అందుకే హేమాహేమీలు తన వద్దకు రావాలి అనుకుంటాడు. నాడు వెయ్యి నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీ దున్నిస్తాను అని కెసిఆర్ ప్రతిజ్ఞ చేస్తే.. ఆయనను తన ఓమ్ సిటీ ద్వారా మాయ చేశాడు. కెసిఆర్ వద్దకే వెళ్లి మాట్లాడాడు. ఇదే విషయాన్ని నరేంద్ర మోదీ వద్ద కూడా ప్రస్తావించాడు. తన అవసరానికీ ఒక్క మెట్టు కిందికి దిగని రామోజీరావు.. రామోజీ ఫిలిం సిటీ విషయంలో మాత్రం కెసిఆర్ శరణు జొచ్చాడు. రామోజీరావు వ్యవహార శైలి ఇలా ఉంటుంది కాబట్టే చిన్న కొడుకు సుమన్ కు ఆయన అంటే ఇష్టం ఉండదు. అప్పట్లో ప్రభాకర్ దీనంతటికీ కారణం అని భావించి రామోజీరావు అతడిని బయటికి వెళ్లగొట్టాడు. కానీ కొంతకాలానికే సుమన్ కన్నుమూశాడు. ఒకవేళ సుమన్ కనుక ఇప్పుడు బతికి ఉండుంటే మార్గదర్శి పరిస్థితి మరో విధంగా ఉండేది. అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసేది. ఇప్పుడు సుమన్ లేకపోయినప్పటికీ జగన్ తవ్వుతున్నాడు.. తవ్వుతూనే ఉంటాడు.