https://oktelugu.com/

రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ?

కన్నడ‌లో యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా ప్రశాంత్‌ నీల్‌కు మంచి పేరుంది. కేజీఎఫ్‌1 తర్వాత అతని పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. రెండేళ్ల కిందట వచ్చిన ఈ పీరియాడికల్‌ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. యశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. కన్నడనాట రూ. 200 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా నిలిచింది. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీలో కూడా విడుదలై మరెన్నో రికార్డులు బద్దలు కొట్టింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 10, 2020 / 01:53 PM IST
    Follow us on


    కన్నడ‌లో యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా ప్రశాంత్‌ నీల్‌కు మంచి పేరుంది. కేజీఎఫ్‌1 తర్వాత అతని పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. రెండేళ్ల కిందట వచ్చిన ఈ పీరియాడికల్‌ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. యశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. కన్నడనాట రూ. 200 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా నిలిచింది. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీలో కూడా విడుదలై మరెన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ప్రస్తుతం కేజీఎఫ్2 పనుల్లో బిజీగా ఉన్నాడు ప్రశాంత్‌. ఇది కూడా భారీ యాక్షన్‌ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అతనిప్పుడు యాక్షన్‌ మూవీస్‌కు కాస్త విరామం ఇచ్చి వేరే జోనర్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కేజీఎఫ్‌ 2 తర్వాత టాలీవుడ్‌ యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాను ఒప్పుకున్నాడు. ఇది మ్యూజిక్‌, డ్యాన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది. మైత్రీ మూవీ మేక్సర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అటు ప్రశాంత్‌, ఇటు ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ మూవీ 2022లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. దీన్ని కన్నడతో పాటు తెలుగులో నేరుగా తెరకెక్కించడంతో పాటు పలు భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు.

    Also Read: స్టార్ హీరో కుమారుడితో సోషల్ మీడియా బ్యూటీ!

    ప్రశాంత్‌ నీల్‌ ఇప్పటికే కథ పూర్తిగా చెప్పగా.. ఎన్టీఆర్ బాగా ఇంప్రెస్‌ అయ్యాడట. ఈ మూవీ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం తెలిసింది. ప్రశాంత్‌ నీల్-ఎన్టీఆర్ చిత్రానికి నిర్మాతలు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారట. 2023లో భారీ స్థాయిలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో మన్యం వీరుడు కొమరం భీమ్‌గా ప్రేక్షకులను అలరించనున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ మరో హీరో. ఆలియా భట్‌, ఐరిష్‌ బ్యూటీ ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.