
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎన్నికల నగారా మోగబోతోందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఏపీ ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రెడీ అయినట్లు తెలుస్తోంది.. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతారని సమాచారం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఒక విడతగా.. మున్సిపల్ ఒక విడతగా.. పంచాయితీలు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తారని మీడియాలో వార్తలు వస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈనెలలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు.ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఈనెల 11 నుంచి 13 వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు. 23న పోలింగ్ నిర్వహించి.. 27న కౌంటింగ్ చేపడుతామని నిమ్మగడ్డ తెలిపారు.
Also Read: ‘జగనన్న విద్యాకానుక’ వాయిదా.. కారణమిదే?
ఊహాగానాల ప్రకారం.. మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ఈ విధంగా ఉంటుందని లీక్ అయ్యింది.
*ఈనెల 11 నుండి 13 వరుకు నామినేషన్స్… 23 పోలింగ్, 27 కౌంటింగ్ ఉంటుంది..*గ్రామపంచాయితీలు రెండు ఫేజులుగా నిర్వహిస్తున్నారని అంటున్నారు.
*ఈనెల 11 నుండి 13 వరుకు నామినేషన్స్… 23 పోలింగ్, 27 కౌంటింగ్ ఉంటుంది..*గ్రామపంచాయితీలు రెండు ఫేజులుగా నిర్వహిస్తున్నారని అంటున్నారు.
*ఫేజ్ 1 – 17 నుండి 19 వరుకు నామినెషన్స్..27 న పోలింగ్, అదే రోజు కౌంటింగ్..
* ఫేజ్ -2 ఈనెల 19 నుండి 21 వరుకు నామినేషన్స్ 29 న పోలింగ్, 29 నే కౌంటింగ్….ఓటర్లని ప్రభావితం చేసే ఏ ప్రభుత్వ స్కీమ్స్ అయినా అమలు నిలుపుదల చేయాలని నిమ్మగడ్డ ఆదేశించినట్టు తెలిసింది. బదిలీలు, నియామకాలు నిషేధిస్తూ ఈసీ నిర్ణయించింది. ఎన్నికలు సజావుగా జరపడానికి కలెక్టర్లకి, ఎస్పీలకు అధికారాలు ఇస్తారు. స్వేచ్చగా, హింసకి తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకొనేలా అందరూ సహకరించాలని నిమ్మగడ్డ కోరనున్నారు.. ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగుల గురించి ఇప్పటికే హైకోర్ట్ లో ఉంది కాబట్టి దానిపై మేము ప్రత్యేక చర్యలు తీసుకోరని తెలిసింది . కార్యాలయాలకు రంగుల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని అనుకుంటున్నామన్నారు.