Ram Mandir : సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.. ఫలితంగా మనం నమ్మలేని నిజాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి.. ప్రస్తుతం అయోధ్యలో రాముడి ప్రతిష్ట సందర్భంగా కొందరు ఔత్సాహిక కళాకారులు రూపొందిస్తున్న చిత్రాలు కూడా అదే విధంగా ఉన్నాయి. తాజాగా అక్బర్ మొమిన్ అనే కళాకారుడు గీసిన పెయింటింగ్ ఆసక్తికరంగా ఉంది. 3డీ విధానంలో రూపొందించిన ఈ చిత్రం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్న వేళ ఈ కళాకారుడు అద్భుతంగా రాముడి చిత్రాన్ని గీశాడు. అయితే ఇది పైకి హనుమంతుడి రూపంతో కనిపించినప్పటికీ అసలు చిత్రం నీటి దగ్గరికి వెళితే గాని తెలియదు. అది చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
అక్బర్ మొమిన్ త్రీడీ విధానంలో ఈ చిత్రాన్ని గీశారు. హనుమంతుడికి సంబంధించి ప్రతి కోణాన్ని కూడా అందులో ఆయన స్పృశించారు. దగదగ మెరిసే కిరీటం, చూడ చక్కని హనుమంతుడి రూపం రూపం, వంటిమీద మెరిసే బంగారు ఆభరణాలు.. ఇలా ప్రతి విషయంలోనూ ఆ కళాకారుడు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. వానర వంశీయుడిని అత్యంత అందంగా చిత్రీకరించారు. దేవదారు కలపతో తయారుచేసిన ఫ్రేమ్ మీద ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు.
అయితే చాలామంది ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. అదే అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా అక్బర్ ఆ చిత్రపటాన్ని అలాగే తీసుకెళ్లి నీటిలో చూపిస్తే హనుమంతుడి రూపం కాస్త రాముడిలాగా దర్శనమిస్తోంది. ఇలా ఆ వీడియోలో హనుమంతుడు కాస్త రాముడు గా మారిపోవడాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అక్బర్ ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలిపారు. అయితే హనుమంతుడు కాస్త రాముడు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నెటిజన్లు అంటున్నారు.. అక్బర్ హనుమంతుని మీద భక్తిని.. రాముడి మీద ఇష్టాన్ని ఒకేసారి ప్రదర్శిస్తున్నారని.. ఇది అందరికీ సాధ్యం కాదని కొనియాడుతున్నారు. రాముడు జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరుపుకుంటున్న సందర్భంగా ఇది అద్భుతమైన త్రీడీ పూజాక్రతువు అని పేర్కొంటున్నారు. గతంలో రాముడు తన గుండెలో కొలువై ఉన్నాడని హనుమంతుడు నిరూపించాడని.. చివరికి నీటిలోనూ హనుమంతుడి ప్రతిబింబం చూపిస్తే రాముడు సాక్షాత్కరించడం గొప్ప విషయం అని నెటిజన్లు పేర్కొంటున్నారు. అక్బర్ రూపొందించిన ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
If Hanuman's image is seen in water, Lord Rama appears. This is the amazing skill of the artist. Artwork by artist Akbar Momin #3D_Art #JaiShreeRam #jaihanuman #Amazing_Skill #GreatWork #WonderfulArt #AkbarMomin pic.twitter.com/j6qYWvU6H5
— Venkatesh (@VenkateshOffi) January 6, 2024