Movie Ticket Price in AP: వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి సంచలనానికి తెరలేపారు. ఏపీలో సినిమా టికెట్ల విషయంపై గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్జీవీ చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్, మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ లపై సంచలన కామెంట్స్ చేశారు. తనకు జగన్ ప్రభుత్వం నచ్చలేదని వెంటనే దిగిపోతారా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రామ్ గోపాల్ వర్మ యూట్యూబ్‌లో ఓ వీడియా పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.
థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రూ.5 నుంచి 200లోపు అన్ని థియేటర్లు, మల్టీప్లెక్సులలో టికెట్ల ధరలను ఫిక్స్ చేశారు. టికెట్ ఇష్యూ కూడా ఆన్ లైన్ చేయడంపై ‘రిపబ్లిక్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. దీనిపై రోజుకో వివాదం రాజకుంటుంది.
Also Read: ఏపీలో టికెట్ల వివాదం ఇప్పట్లో తేలేలాగా లేదుగా..!
శ్యాం సింగరాయ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నేచురల్ స్టార్ నాని కూడా ఏపీలో సినిమా టికెట్ ధరలపై స్పందిస్తూ.. థియేటర్ల కంటే కిరాణా కొట్టోడు లాభపడతాడని, ప్రేక్షకులకు వంద రూపాయలు పెట్టి సినిమా చూసే కెపాసిటీ ఉన్నప్పుడు రూ.5కు టికెట్ ధర పెట్టి వారి పరువుతీయొద్దంటూ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు.
నాని వ్యాఖ్యలపై అటు ఏపీ మంత్రులు పేర్నీ నాని, బొత్స శ్రీనివాస్ రావు, అనిల్ కుమార్ మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్జీవీ కూడా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని నిర్మోహమాటంగా ఖండించారు. జగన్ అంటే తనకు వ్యక్తిగతంగా ఇష్టమని, గత ఎన్నికల్లో వైఎస్సార్‌ను చూసి ప్రజలు ఓట్లు వేశారని వివాదాస్పద కామెంట్స్ చేశారు. సినిమా అమ్మకం దారు, కొనుగోలు దారు మధ్య ప్రభుత్వం పెత్తనం ఏంటనీ నిలదీశారు. తనకు జగన్ ప్రభుత్వం నచ్చలేదని చెబితే దిగిపోతారా? అంటూ కామెంట్స్ చేశారు.
Also Read: తగ్గేదే లే.. సినిమా టికెట్ రేట్ల విషయంలో జగన్ డిసైడ్?