Rakesh Tikait: దేశంలోని బీజేపీని ముప్పుతిప్పలు పెట్టిన రైతు సంఘం నేతగా రాకేష్ టికాయత్ కు పేరుంది. కేంద్రంలోని మోడీ సర్కార్ సాగు చట్టాలు రూపొందించడంతో వాటిని వ్యతిరేకిస్తూ రైతులతో పెద్ద ఉద్యమం చేసి దేశవ్యాప్తంగా హీరో అయిపోయాడు రాకేష్ టికాయత్. ఏకంగా రాజధాని ఢిల్లీలో ఏడాది పాటు పంజాబ్, హర్యానా, యూపీ రైతులతో కలిసి తిష్టవేసి మోడీ సర్కార్ మెడలు వంచి సాగు చట్టాలు రద్దు అయ్యేలా చేశాడు..
ప్రతిపక్షాలు పాలనలో ఉన్న రాష్ట్రాలకు వెళ్లిన టికాయత్ కు ఘన స్వాగతాలు సహజంగానే లభించాయి. జాతీయ నేతగా ఎదగాలనుకుంటున్న కేసీఆర్ లాంటి వారు ఈ రైతు నేత టికాయత్ ఇంటికెళ్లి మరీ కలిసి చర్చలు జరిపారు. అయితే బీజేపీ పాలనలో ఉన్న కర్నాటకకుకు వచ్చిన టికాయత్ కు ఇప్పుడు చేదు అనుభవం ఎదురైంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం ఆయనపై కొందరు దాడి చేశారు. ఆయనపై చేయి చేసుకోవడమే కాదు.. ఇంకుతో దాడి చేశారు. రైతు సంబంధ అంశాలపై ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా బీజేపీ సానుభూతి పరులు జై మోడీజీ అని.. ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న టికాయత్ పై పడి దాడికి పాల్పడ్డారు.
దాడి చేసిన వారిని రైతు సంఘాల వారు పట్టుకునేందుకు ప్రయత్నించగా గలాటా జరిగింది. ప్రధాని మోడీ పేరును నినాదిస్తూ వారు కుర్రీలు విసిరారు. రైతు నాయకులు వారిపై దాడికి దిగడంతో గందరగోళం నెలకొంది.
Also Read: BJP And TRS Competing For Power: అధికారమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీయేనా?
ఇంకు పడిన ముఖంతోనే రాకేష్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలే తనపై దాడి చేశారని.. సెక్యూరిటీ కల్పించని కర్ణాటక పోలీసులదే ఈ బాధ్యత అని టికాయత్ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
కాగా టికాయత్ ప్రాంతీయ, జాతీయ పార్టీలతో అంటకాగి రైతు ఉద్యమాన్ని అమ్మేస్తున్నాడని ఇప్పటికే రైతు సంఘం ‘బీజేకే’ రెండుగా చీలింది. పైగా టికాయత్ సన్నిహితుడైన రైతు సంఘం నాయకుడు లంచం తీసుకుంటూ పట్టుబడడంతో ఇప్పుడు ఆయనను నమ్మే వారే లేకుండా పోయారు. తాజాగా బీజేపీ నేతల దాడితో ఉన్న పరపతి కూడా పోయింది.
టికాయత్ విశ్వసనీయత కోల్పోవడంతో వ్యూహాత్మకంగానే బీజేపీ నేతలు దాడి చేసి ఆయనను అవమానించారని.. ఇదంతా టికాయత్ చేసుకున్న ఖర్మ అని కొందరు సెటైర్లు వేశారు.
Also Read: Balayya Came Indian Idol Show: ‘ఇండియన్ ఐడల్’ షోకి బాలయ్య అందుకే వచ్చాడు !