
ఈనెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యారు. అక్టోబర్ 1వరకు అనగా 18రోజులు సమావేశాలు నిర్వహించేలా నిర్ణయించారు. అయితే కేవలం పదిరోజుల్లో సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు. నేటి నుంచి నిరవధికంగా రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్రం ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో వ్యవసాయ సంస్కరణ పేరిట మూడు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుంది. రాజ్యసభలో విపక్షాలకు సంఖ్యబలం ఉండటంతో ఈ బిల్లులను అడ్డుకునేందుకు శయశక్తులా ప్రయత్నించాయి. ఆదివారం రాజ్యసభలో 8మంది సభ్యులను సస్పెండ్ చేసి మరీ బీజేపీ సర్కార్ ముజువాణి ఓటుతో ఈ బిల్లులను ఆమోదించుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది.
దీంతో విపక్ష సభ్యులంతా పార్లమెంట్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందటంతో తదుపరి కార్యచరణను ప్రతిపక్షాల పార్టీలు చేపట్టారు. కాంగ్రెస్ నేతత్వంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసేందుకు రెడీ అవుతున్నారు. విపక్షాలన్నీ ఒక్కటితాటిపై వస్తుండటంతో అప్రమత్తంగా బీజేపీ నేతలు కరోనా సాకుతో రాజ్యసభను నిరవధికంగా వేయాలని భావించారు.
ముందుగా ఊహించినట్లుగానే నేటి సమావేశాలు జరిగాయి. రాజ్యసభలోని కొందరు సభ్యులు, సిబ్బంది కరోనా బారినపడటంతోనే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకటయ్య నాయుడు తెలిపారు. రాజ్యసభలో 25బిల్లుల ఆమోదం పొందాయని.. 198మంది ఎంపీలు రాజ్య సభ చర్చల్లో పాల్గొన్నారని.. ఉత్పాదకత 100.47శాతం ఉందని.. 1567 అన్ స్టార్డ్ ప్రశ్నలకు రాజ్యసభ సమాధానం ఇచ్చినట్లు ప్రకటించారు.
కేంద్రం వ్యవసాయ బిల్లులను అమలు చేస్తే దేశంలోని రైతులు ఎక్కువగా నష్టపోతారని విపక్ష నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు పార్లమెంట్ ఎదుట నిరసన చేపడుతున్నారు. ఈక్రమంలోనే రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో విపక్ష నేతలు వ్యవసాయ బిల్లుల అంశంపై చర్చించేందుకు నేటి సాయంత్రం 5గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు నిర్ణయించారు. కాగా వీరికి రాష్ట్రపతి అపాయిమ్మెంట్ లభిస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే..!