కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోంది. దేశంలోని 61 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. కరవు భత్యం (డీఏ)తో పాటు డియర్‌నెస్ రిలీప్ (డీఆర్)లను భారీగా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఉన్న 28 శాతం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏ, డీఆర్ పెరగనున్నాయని సమాచారం.
Also Read: తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..?
ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. డీఏ, డీఆర్ పెరిగితే 2021 సంవత్సరం జనవరి నెల నుంచే వర్తించే అవకాశాలు ఉన్నాయి. అయితే కేంద్ర పభుత్వం నుంచి మాత్రం డీఏ, డీఆర్ లకు సంబంధించిన ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు వెలువడకపోవడం గమనార్హం.
Also Read: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఐదులో చేరితే పీజీ వరకు ఫ్రీ..!
ఉద్యోగులు, పెన్షనర్లు ఈ ప్రకటన కోసం ఎదురు చూస్తుండగా ఈ ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో తెలియాల్సి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కలవడంతో పాటు డ్రవ్యోల్బణం ఆధారంగా పెన్షనర్లు, ఉద్యోగులకు డీఏ పెంచాలని వారు కోరారు. డీఏ పెంపుకు సంబంధించి త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం డీఏపై 12,510 కోట్ల రూపాయలు, డీఆర్‌పై 14,595 కోట్ల రూపాయలు కేంద్రంపై భారం పడనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుకు గతంలోనే ఆమోదం తెలిపినా కొన్ని కారణాల వల్ల గత కొన్ని నెలలుగా ఈ పెంపును నిలిపివేసినట్లు తెలుస్తోంది.