షర్మిల ఎఫెక్టేనా.. కాంగ్రెస్ లో చిచ్చు

కాంగ్రెస్ పార్టీలో మరో చిచ్చు రేగుతోంది. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు వార్తల్లో నిలిచే రాజగోపాల్ రెడ్డి తాజాగా వైఎస్ షర్మిల చేపట్టే నిరాహార దీక్షకు మద్దతు పలికి సంచలనమయ్యారు. జిల్లాకు చెందిన నిరుద్యోగి పాక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోగా ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్ తో షర్మిల దీక్ష చేస్తున్న సందర్భంలో రాజగోపాల్ రెడ్డి ఆమెకు సంఘీభావం ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో […]

Written By: Srinivas, Updated On : July 28, 2021 7:13 pm
Follow us on

కాంగ్రెస్ పార్టీలో మరో చిచ్చు రేగుతోంది. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు వార్తల్లో నిలిచే రాజగోపాల్ రెడ్డి తాజాగా వైఎస్ షర్మిల చేపట్టే నిరాహార దీక్షకు మద్దతు పలికి సంచలనమయ్యారు. జిల్లాకు చెందిన నిరుద్యోగి పాక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోగా ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్ తో షర్మిల దీక్ష చేస్తున్న సందర్భంలో రాజగోపాల్ రెడ్డి ఆమెకు సంఘీభావం ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఓ పక్క షర్మిలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆమెకు మద్దతు పలకడంపై ఆశ్చర్యం కలుగుతోంది. షర్మిల పార్టీకి కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు పలకడంపై ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి విషయం ఆసక్తి నెలకొంది. పార్టీని గాడిన పెట్టే పనిలో రేవంత్ రెడ్డి ఉండగా కోమటిరెడ్డి చేసిన పనికి పార్టీ పరువు బజారున పడినట్లయింది.

వైఎస్ షర్మిల పార్టీలోకి త్వరలో వలసలు పెరుగుతాయని ప్రచారం సాగుతున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పార్టీకి కొరకరాని కొయ్యగా మారే ప్రమాదం అవుతుంది. షర్మిల పార్టీ ఆవిర్భావానికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైనట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో మనుగడ ఉంటుందా అనే అనుమానాలు పలువురిలో నెలకొంటున్నాయి. ఒక్కొక్కరుగా ఇలా పార్టీ క్రమశిక్షణను తృణీకరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయోనని చూస్తున్నారు.

ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గంలో చీలికలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. రేవంత్ తీసుకుంటున్న చర్యలకు పార్టీలోని వారే తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదనే సాకుతో పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయ్యే సూచనలు ఉన్నాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి. రాష్ర్టంలో షర్మిలకు బలముందా అనే ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తతంగం పలు సందేహాలకు తావిస్తోంది. ఇలాంటి సమయంలో సీనియర్లు షర్మిలకు మద్దతు ప్రకటిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు.