https://oktelugu.com/

కొత్త సచివాలయం నమూనా మసీదులా….! :బిజెపి ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్ తాజాగా ఆర్భాటంగా కొత్త సచివాలయం నమూనాను రిలీజ్ చేశారు. ఇప్పటికే హైకోర్టు తీర్పుతో పాత సచివాలయాన్ని కూల్చే పనిలో తెలంగాణ సర్కార్ బిజీగా ఉంది. దాని ప్లేసులో కట్టబోయే కొత్త సచివాలయం నమూనాను తెలంగాణ సీఎంవో ఈరోజు విడుదల చేసింది. అయితే ఇప్పుడు అది కొత్త వివాదానికి దారితీస్తోంది. చిచ్చుపెట్టిన కరోనా.. కేసీఆర్ తో గవర్నర్ ఫైట్? అసలే కరోనా టైం. ఇంతటి కరువు కాటకాల్లో కేసీఆర్ వాస్తు బాగోలేదని కొత్త సచివాలయం కట్టడంపై […]

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2020 / 04:49 PM IST
    Follow us on


    సీఎం కేసీఆర్ తాజాగా ఆర్భాటంగా కొత్త సచివాలయం నమూనాను రిలీజ్ చేశారు. ఇప్పటికే హైకోర్టు తీర్పుతో పాత సచివాలయాన్ని కూల్చే పనిలో తెలంగాణ సర్కార్ బిజీగా ఉంది. దాని ప్లేసులో కట్టబోయే కొత్త సచివాలయం నమూనాను తెలంగాణ సీఎంవో ఈరోజు విడుదల చేసింది. అయితే ఇప్పుడు అది కొత్త వివాదానికి దారితీస్తోంది.

    చిచ్చుపెట్టిన కరోనా.. కేసీఆర్ తో గవర్నర్ ఫైట్?

    అసలే కరోనా టైం. ఇంతటి కరువు కాటకాల్లో కేసీఆర్ వాస్తు బాగోలేదని కొత్త సచివాలయం కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ప్రస్తుతం ఉన్న సచివాలయం భవనాలు మరో 50 ఏళ్ల పాటు మన్నికగా ఉంటాయని నిపుణులు చెప్పారు. కానీ వాస్తును బాగానే నమ్ముకున్న కేసీఆర్ ఈ పాత సచివాలయం కూల్చివేతకే మొగ్గు చూపారు. 500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకున్నారు.

    కాంగ్రెస్ సహా కొందరు ప్రతిపక్షాలు సచివాలయం కూల్చివేతపై హైకోర్టుకు ఎక్కి అడ్డుకున్నా చివరకు కేసీఆర్ సర్కారుకే కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా కొత్త సచివాలయం నిర్మించడానికి కేసీఆర్ రెడీ అయ్యారు.

    పవన్ ప్రణాళిక మొత్తం చెడేలా ఉందే..!

    అయితే తాజాగా విడుదల చేసిన సచివాలయం నమూనా తెలంగాణ సంస్కృతి కంటే ముస్లింల సంస్కృతికి దగ్గరగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి బలాన్ని ఇచ్చేలా తాజాగా తెలంగాణలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. కొత్త సచివాలయం నమూనా మసీదులా .. హజ్ హౌస్ లా ఉందని హాట్ కామెంట్స్ చేశారు. నిజాం రాజు చార్మినార్ నిర్మిస్తే.. కేసీఆర్ సచివాలయాన్ని నిర్మించి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్లాన్ ఎంఐఎం ఇచ్చారా అని ఎద్దేవా చేశారు.

    నిజానికి కేసీఆర్ ఆమోదం తెలిపిన కొత్త సచివాలయం నమూనాపై మసీదుపై ఉండే గుండ్రటి గోపురాలు ఉండడంతో అందరికీ అలానే అనిపిస్తోంది. హిందూ, తెలంగాణ సంప్రదాయాలు కనిపించడం లేదంటున్నారు. పోనీ ఇది అత్యాధునిక మోడల్ కూడా కాదు.. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యలకు బలాన్నిచ్చేలా ఉన్న కొత్త సచివాలయం నమూనాపై సోషల్ మీడియాలో బీజేపీ నేతలు, హిందుత్వవాదులు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.