ఏపీ బీజేపీకి అస్త్రంగా రాజాసింగ్‌

తెలంగాణలో అతిచిన్న నియోజకవర్గం గోషామహల్‌. గోషామహల్‌ కేరాఫ్‌ రాజాసింగ్‌. ఎందుకంటే.. ఆ నియోజకవర్గం నుంచి హిందూత్వ వాదంతో గెలుస్తూ వస్తున్నారు. రాజాసింగ్‌ అంటేనే ఓ ఫైర్‌‌ బ్రాండ్‌. అయితే.. ఇప్పుడు రాజాసింగ్‌ లోథ్‌ను ఏపీపైకి ప్రయోగించాలని చూస్తున్నారట. ఏపీలోని శ్రీశైలం ఆలయంపై దృష్టి పెట్టి అక్కడి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయిస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే కూడా ఆయన స్పందించడమే మహాభాగ్యమన్నట్లుగా తాను కూడా చెలరేగి ప్రకటనలు చేస్తున్నారు. Also Read: బీజేపీ ఫోకస్ అంతా వారిపైనే..! శ్రీశైలంలోని దుకాణ […]

Written By: Srinivas, Updated On : December 27, 2020 1:38 pm
Follow us on


తెలంగాణలో అతిచిన్న నియోజకవర్గం గోషామహల్‌. గోషామహల్‌ కేరాఫ్‌ రాజాసింగ్‌. ఎందుకంటే.. ఆ నియోజకవర్గం నుంచి హిందూత్వ వాదంతో గెలుస్తూ వస్తున్నారు. రాజాసింగ్‌ అంటేనే ఓ ఫైర్‌‌ బ్రాండ్‌. అయితే.. ఇప్పుడు రాజాసింగ్‌ లోథ్‌ను ఏపీపైకి ప్రయోగించాలని చూస్తున్నారట. ఏపీలోని శ్రీశైలం ఆలయంపై దృష్టి పెట్టి అక్కడి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయిస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే కూడా ఆయన స్పందించడమే మహాభాగ్యమన్నట్లుగా తాను కూడా చెలరేగి ప్రకటనలు చేస్తున్నారు.

Also Read: బీజేపీ ఫోకస్ అంతా వారిపైనే..!

శ్రీశైలంలోని దుకాణ సముదాయాల కేటాయింపుల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తీసేయాలని.. కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని వాదించారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి.. శ్రీశైలం చుట్టుపక్కల ముస్లింలకు ఎక్కువ శాతం షాపులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. అన్యమతస్థులకు దుకాణాలు ఇవ్వకూడదన్న అంశం దేవాదాయ చట్టంలో స్పష్టంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

అయితే.. రాజాసింగ్ ఆరోపణలపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హిందూమతాన్ని అడ్డుపెట్టుకొని.. ఏపీలో ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. శ్రీశైలంలో ముస్లింలు 40 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు. సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్లు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. రజాక్ అనే వ్యక్తిని తనకు బినామీగా చెప్పడాన్ని ఎమ్మెల్యే ఖండించారు.

Also Read: వీహెచ్‌కు వాళ్లపై అంత అక్కసు ఎందుకో..

వాస్తవానికి శ్రీశైలం అంశాన్ని వివాదాస్పదం చేయడం ఇదేం మొదటి సారి కాదు. గతేడాది కూడా దుకాణాల వేలం సమయంలో.. దుకాణాలను స్థానికులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తున్నారంటూ బీజేపీ చలో శ్రీశైలం కార్యక్రమం నిర్వహించింది. వేలం నిలిపివేయడంతో అప్పట్లో వివాదం సద్దు మణిగింది. ఆ తర్వాత మెల్లగా మళ్లీ ముస్లింలకు షాపులు కేటాయించారన్న అనుమానాలున్నాయి. శ్రీశైలం ఆలయం వద్ద పెత్తనాన్ని ఎక్కువగా ఎమ్మెల్యే అనుచరుడు రజాక్ చేస్తూంటారు. దీంతో వైసీపీ నేతలకు సమర్థించుకోవడానికి లేకుండా పోతోంది. కొత్తగా ఘంటామఠం అనే ప్రాంతం తవ్వకాల్లో గుప్త నిధులు బయటపడ్డాయని బీజేపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. మొత్తంగా ఏపీలో బీజేపీ ఎదగడానికి మరో తెలంగాణ నేతను వాడుకుంటన్నట్లుగా అర్థమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్