వి.హనుమంతారావు కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఆయన ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా అది చర్చకు దారితీస్తుంటాయి. ఎవరైనా ఏదైనా ప్రశ్నలు వేసినా ఆ సమాధానాలు కూడా వెరైటీగా ఉంటాయి. ‘మీ ఏజ్ పెరిగిపోయింది కదా.. ఇక రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవచ్చు కదా’ అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు.. ‘నేను వృద్ధుడిని కాదు.. నేను ఇంకా యూతే. రాజకీయాల నుంచి నేనెందుకు తప్పుకుంటా’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ మాటలను బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏంటో.
Also Read: బీజేపీ ఫోకస్ అంతా వారిపైనే..!
ఈ నేత ఇప్పుడు ఏకంగా ఆయన పీసీసీ చీఫ్ పదవికే ప్రయత్నాలు చేశారు. అయితే.. పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి దాదాపుగా కన్‌ఫాం కావడంతో మరోసారి దాని అక్కసును బయటపెట్టారు. రేవంత్‌రెడ్డికి కనుక పీసీసీ చీఫ్ ఇస్తే తాను పార్టీ నుంచి తప్పుకుంటానని బాహాటంగా చెప్పారు. అవసరమైతే కొత్త పార్టీని పెడుతానంటూ చెప్పుకొస్తున్నారు. అయితే.. ఇప్పుడు మరోసారి తన కోపాన్ని వెల్లగక్కారు.
రాష్ట్రంలో కేవలం 3 శాతం ఉన్న ఆ సామాజిక వర్గం పెత్తనం ఏంటి అంటూ తన ఆక్రోశాన్నంతా వెళ్లగక్కారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతారావు. ఇన్నాళ్లూ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి వద్దంటే వద్దన్న హనుమంతన్నకు టీడీపీ నుంచి వచ్చాడనే కారణంతో ఆయనపై అంత కోపం ఉంది కాబోలు అని అనుకున్నారంతా. కానీ ఆయన కడుపుమంట అంతా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చినందుకు కాదు, కాంగ్రెస్‌నే నమ్ముకుని ఉన్న సీనియర్లను అధిష్టానం పక్కనపెట్టినందుకు కాదు. కేవలం రేవంత్ సామాజిక వర్గం గురించే హనుమంతరావు బాధంతా.
Also Read: జడ్జిలపై ఆ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణకు వెళ్లిన వీహెచ్.. కాపులకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. పనిలో పనిగా పవన్ కల్యాణ్ కాంగ్రెస్‌లోకి వస్తే తెలంగాణ పీసీసీ పదవి ఇప్పిస్తానంటూ మాట్లాడేశారు. దాదాపుగా టీపీసీసీ రేవంత్ కి ఖరారైపోయిన వేళ, మరోసారి ఆ పదవికి పవన్ కల్యాణ్‌కు లింకు పెట్టి ఆవేశపడ్డారు వీహెచ్ గారు. అదే ఆవేశంలో అసలు విషయం కూడా చెప్పుకొచ్చారు. కేవలం 3 శాతం ఉన్న ఆ సామాజికవర్గానికే అన్ని పదవులూ ఎందుకంటూ ప్రశ్నించారు. పీసీసీ పదవి బీసీలకు ఇవ్వాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు. అప్పట్లో జగన్ పై హనుమంతన్నకు ఉంది కేవలం జూనియర్, సీనియర్ అనే ఇగో మాత్రమే అనుకున్నారంతా. కానీ ఆయనలో ఉన్నది కుల దురాభిమానమని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్