Praja Sangram Yatra: టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి భారీగా చేరికలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీకి ఊపు వస్తోంది. ఊహించని విధంగా టీఆర్ఎస్ కు షాక్ తగులుతోంది. ఆ పార్టీలోని నేతలంతా బీజేపీలో చేరిపోతున్నారు. తాజాగా దుబ్బాక, నారాయణపేట, కొడంగల్, భువనగిరి, చేవెళ్ల నియోజకవర్గాల టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరడం అధికార పార్టీకి షాక్ తగిలినట్టైంది. ప్రజా సంగ్రామ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రతిరోజు వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి […]

Written By: NARESH, Updated On : September 2, 2021 8:33 pm
Follow us on

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీకి ఊపు వస్తోంది. ఊహించని విధంగా టీఆర్ఎస్ కు షాక్ తగులుతోంది. ఆ పార్టీలోని నేతలంతా బీజేపీలో చేరిపోతున్నారు. తాజాగా దుబ్బాక, నారాయణపేట, కొడంగల్, భువనగిరి, చేవెళ్ల నియోజకవర్గాల టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరడం అధికార పార్టీకి షాక్ తగిలినట్టైంది.

ప్రజా సంగ్రామ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రతిరోజు వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తున్న పాదయాత్రకు విచ్చేసి సంఘీభావం తెలుపుతున్నారు. మరోవైపు ఈ యాత్ర అధికార పార్టీ సహా ఇతర పార్టీల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. యాత్రకు విశేష స్పందన లభిస్తుండటం, ప్రజలు బీజేపీ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తుండటంతో ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరుతున్నారు. అందులో భాగంగా గురువారం దుబ్బాక, నారాయణపేట, కొడంగల్, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆయా నియోజకవర్గాల్లోని వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.

దుబ్బాకలోని చేగుంట మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు మున్నూరు రాంచంద్రర్ తో పాటు వందలాది నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ మంత్రి విజయరామారావు సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. భువనగిరి మండలం వివిధ తండాల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ కుమార్, బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం నుండి శ్రీదేవి రెడ్డి ఆధ్వర్యంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చెందిన పలువురు బీజేపీ కండువా కప్పుకున్నారు. నవీన్ కుమార్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, రఘు, రామకృష్ణ, సురేష్,శేఖర్, రవి, శ్రీకాంత్, నరసింహ గౌడ్ బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు. నారాయణపేట చేవెళ్ల నియోజకవర్గాల నుంచి వందలాది మంది కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి బిజెపిలోకి వచ్చారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నారాయణపేట జిల్లాకు చెందిన వందలాది మంది కార్యకర్తలు సైతం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ బీజేపీ కండువా కప్పుకున్నారు. విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు సైతం బీజేపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు బండి సంజయ్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆయనతోపాటు పాదయాత్ర చేయడం గమనార్హం. యాత్ర ప్రారంభంలోనే టీఆర్ఎస్ ను క్లీన్ స్వీప్ చేస్తున్న బండి సంజయ్ ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగిస్తే బీజేపీలో బలోపేతంతోపాటు అధికార టీఆర్ఎస్ కు దెబ్బ పడడం ఖాయంగా కనిపిస్తోంది.